Vishwak Sen : సినిమా షూటింగ్‌లో నాకు గాయం అయితే.. బాలకృష్ణ గారు నెక్స్ట్ సీన్‌కి..

'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా షూటింగ్‌లో విశ్వక్ సేన్ కి గాయం అయితే, నెక్స్ట్ షాట్ కి బాలకృష్ణ..

Vishwak Sen : సినిమా షూటింగ్‌లో నాకు గాయం అయితే.. బాలకృష్ణ గారు నెక్స్ట్ సీన్‌కి..

Vishwak Sen interesting comments about Nandamuri Balakrishna

Updated On : February 17, 2024 / 5:34 PM IST

Vishwak Sen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ రీసెంట్ గా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హీరోగా తన కెరీర్ ప్రయాణం ఏంటి అనేది విశ్వక్ అందరికి తెలియజేశారు. అలాగే ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలతో తన రిలేషన్ ఎలాంటిదో చెప్పుకొచ్చారు. ఈక్రమంలోనే బాలయ్యతో జరిగిన ఓ సంఘటనని విశ్వక్ అభిమానులతో పంచుకున్నారు.

అన్‌స్టాపబుల్ షోకి గెస్ట్ గా వెళ్లిన దగ్గర నుంచి విశ్వక్.. బాలకృష్ణతో మంచి రాపో మెయిన్‌టైన్ చేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే బాలయ్యని రెగ్యులర్ గా కలవడం, పార్టీలు చేసుకోవడం వంటి చేస్తూ వస్తున్నారు. బాలకృష్ణ కూడా విశ్వక్ పై అదే ప్రేమ చూపిస్తూ వస్తున్నారు. అలా బాలయ్య తన పై చూపించే ప్రేమకి సంబంధించిన ఓ సంఘటనని విశ్వక్ అభిమానులతో పంచుకున్నారు.

Also read : Suhani Bhatnagar : 19 ఏళ్లకే మరణించిన సుహానీ భట్నాగర్ ఎవరు? దంగల్ తర్వాత సినిమాలకు ఎందుకు దూరమైంది?

విశ్వక్ ప్రస్తుతం ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఆ మూవీలో ఫైట్ సీక్వెన్స్ షూటింగ్ సమయంలో.. విశ్వక్ లారీ పై నుంచి కిందపడడంతో గాయాలు చిన్న అయ్యాయి. ఐదు రోజుల తరువాత విశ్వక్ కోలుకున్న తరువాత మళ్ళీ ఆ షాట్ ని షూట్ చేశారు. ఇక ఈ ప్రమాద విషయం బాలకృష్ణకి తెలియడంతో.. విశ్వక్ చేయాల్సిన ఆ సీన్ షాట్ కి బాలయ్య ముహూర్తం పెట్టి పంపించారట. ఆ ముహార్తానికి విశ్వక్ తో షూట్ చేయండని చెప్పారట.

ఈ ఒక్క సంఘటనతో బాలయ్య, విశ్వక్ మధ్య ఎంతటి రాపో ఉందో అందరికి తెలిసిపోయింది. అయితే కేవలం బాలయ్యతోనే కాదు రానా దగ్గుబాటి, రామ్ చరణ్ తో కూడా అలాంటి రిలేషనే మెయిన్‌టైన్ చేస్తున్నారు. రానా, విశ్వక్ ని బ్రదర్ లా ట్రీట్ చేస్తారట. ఇక చరణ్.. నువ్వు ఎలా ఉన్నవో అలాగే ఉండు. కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నావు అంటూ వెల్ విషర్ గా సలహాలు ఇస్తుంటారట. అలాగే ఎన్టీఆర్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంటారంట.