Vishwak Sen : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్.. ఆగష్టు 15న.. పోస్టు వైరల్..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. విశ్వక్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్యామిలీ జర్నీ స్టార్ట్ చేయబోతున్నా..

Vishwak Sen : పెళ్లి పీటలు ఎక్కబోతున్న విశ్వక్ సేన్.. ఆగష్టు 15న.. పోస్టు వైరల్..!

Vishwak Sen is ready to getting married instagram post viral

Vishwak Sen : టాలీవుడ్ ఒక్కో యంగ్ హీరో పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. ఇటీవల శర్వానంద్ ఏడడుగులు వేయగా, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ రింగ్ మార్చుకొని మూడు ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గామి, VS10, VS11 మూడు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ హీరో.. చేసిన ఒక పోస్టు చూస్తుంటే పెళ్లి అప్డేట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది.

Ram Gopal Varma : పవన్, లోకేశ్ డబ్బులిచ్చి.. వాళ్లకి అనుకూలంగా సినిమా తీయమంటే చేస్తారా..? వర్మ జవాబు ఏంటి..?

“ఇన్నాళ్ల నుంచి నా పై ప్రేమ చూపించే అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. ఇక ఇప్పుడు మీ అందరితో ఒక విషయం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నా జీవితంలోని మరో ఘటాన్ని నేను ప్రారభించబోతున్నాను. నేను కుటుంబాన్ని మొదలుపెట్టబోతున్నాను. ఆగష్టు 15న పూర్తి వివరాలు తెలియజేస్తాను” అంటూ పేర్కొన్నాడు. ఈ పోస్టు చూస్తుంటే పెళ్లి వార్తలాగానే ఉందని అనిపిస్తుంది. అయితే ఈ మాస్ కా దాస్ ని వరించబోయే ఆ వధువు ఎవరో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఎదురు చూడాల్సిందే.

Ram Gopal Varma : వివేకా కేసులోని నిందితుడిని ‘వ్యూహం’ సినిమాలో వర్మ చూపించబోతున్నాడా..?

 

View this post on Instagram

 

A post shared by Vishwak Sen (@vishwaksens)

ఇక విశ్వక్ సినిమాల విషయానికి వస్తే.. గామి షూటింగ్ పూర్తి అయ్యిపోయి పోస్టు ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో విశ్వక్ అఘోరగా కనిపించబోతున్నాడు. చాందిని చౌదరి ఫీమేల్ లీడ్ లో నటిస్తుంది. VS10 చిత్రం కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో VS11 ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ టైటిల్ తో రా అండ్ రస్టిక్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అంజలి, నేహశెట్టి హీరోయిన్స్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో విశ్వక్ మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ అందర్నీ ఆకట్టుకుంది.