Vishwak Sen : ‘లైలా’గా కనిపించబోతున్న మాస్ కా దాస్.. VS12 టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో..

విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త మూవీ VS12 టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో వచ్చేసింది.

Vishwak Sen : టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ పుట్టినరోజు కావడంతో.. నేడు తన కొత్త సినిమాల నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే మాస్ కమర్షియల్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు కల్ట్, VS10, VS12 మూవీస్ చేస్తున్నారు. వీటిలో VS12 మూవీని షైన్ స్క్రీన్ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది. నేడు విశ్వక్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్ ని అనౌన్స్ చేసారు.

ఈ సినిమాకి ‘లైలా’ అనే టైటిల్ ని పెట్టారు. మూవీలో లైలా మరెవరో కాదు విశ్వక్ సేనే. ఈ మూవీలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించబోతున్నారట. మాస్ అపిరెన్స్ తో కమర్షియల్ గా మంచి ఇమేజ్ ని సొంతం చేసుకున్న విశ్వక్.. అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ఈక్రమంలోనే గామి, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా, ముఖచిత్రం వంటి సినిమాల్లో కూడా నటిస్తూ.. నటుడిగా తన వేర్సాటిలిటీని పరీక్షించుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే లైలా కూడా చేస్తున్నారు.

Also read : Nandamuri Balakrishna : లెజెండ్ సినిమాలో ఆ స్టంట్‌ని డూప్ లేకుండా చేశాను.. బాలయ్య కామెంట్స్..

రామ్ నారాయణ్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఆకాంక్ష శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. తనిష్క్ బఘ్చి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టి పూర్తి చేయనున్నారు. కాగా గతంలో ఇలా లేడీ గెటప్ లో చిరంజీవి, రాజేంద్రప్రసాద్, కమల్ హాసన్, మనోజ్, నరేష్, అల్లు అర్జున్.. వంటి స్టార్స్ కనిపించి మెప్పించారు. మరి ఇప్పుడు విశ్వక్ ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

 

ట్రెండింగ్ వార్తలు