Nandamuri Balakrishna : లెజెండ్ సినిమాలో ఆ స్టంట్‌ని డూప్ లేకుండా చేశాను.. బాలయ్య కామెంట్స్..

లెజెండ్ సినిమాలో ఆ స్టంట్‌ని బాలయ్య డూప్ లేకుండా చేశారంట.

Nandamuri Balakrishna : లెజెండ్ సినిమాలో ఆ స్టంట్‌ని డూప్ లేకుండా చేశాను.. బాలయ్య కామెంట్స్..

Nandamuri Balakrishna did that stunt without doop in legend

Updated On : March 29, 2024 / 3:36 PM IST

Nandamuri Balakrishna : పదేళ్ల క్రితం బాలయ్య నుంచి వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘లెజెండ్’. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో జగపతిబాబు విలన్‌గా, సోనాల్ చౌహాన్, రాధిక ఆప్టే హీరోయిన్స్‌గా నటించారు. ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం కావడంతో.. రిలీజ్ కి ముందు ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ తరువాత ఆ అంచనాలను అందుకోవడం కాదు, అధిగమించాయి కూడా.

నిన్న మార్చి 28తో ఈ మూవీ రిలీజయ్యి పదేళ్లు పూర్తి అయ్యింది. దీంతో మూవీ టీం హైదరాబాద్ లో ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో బాలయ్య, సోనాల్ చౌహాన్, దర్శక నిర్మాతలతో పాటు మరికొంతమంది నటీనటులు కూడా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ.. ఈ మూవీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లో వచ్చే ఫస్ట్ ఫైట్ మొత్తం స్టంట్ డూప్ లేకుండానే బాలయ్య చేసినట్లు చెప్పుకొచ్చారు.

Also read : Kaliyugam Pattanamlo Review : ‘కలియుగం పట్టణంలో’ రివ్యూ.. థ్రిల్లర్ సినిమాకి మదర్ సెంటిమెంట్..

వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద జరిగే ఆ ఫైట్ సీన్ లో బాలయ్య గుర్రం పై సవారీ చేసే సన్నివేశం కూడా ఉంటుంది. ఆ సీన్ లో బాలయ్య గుర్రంతో పాటు ఒక అద్దాన్ని బ్రేక్ చేసుకొని సవారీ చేస్తారు. ఆ స్టంట్ ని డూప్ లేకుండా బాలయ్య చేశారట. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్యే చెప్పుకొచ్చారు. కాగా ఈ మూవీ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన ‘అఖండ’. ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ సినిమాలో బాలయ్య అఘోరగా కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ చేసారు. దీంతో ఆ పాత్రతో మరో సినిమాని కూడా చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అందువలనే మేకర్స్ కూడా సీక్వెల్ తీసుకు వస్తామంటూ మాట ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయ్యిందని రచయిత తెలియజేసారు. మరి ఈ మూవీ ఎప్పుడు వస్తుందో చూడాలి.