Kaliyugam Pattanamlo Review : ‘కలియుగం పట్టణంలో’ రివ్యూ.. థ్రిల్లర్ సినిమాకి మదర్ సెంటిమెంట్..

థ్రిల్లర్ సినిమాగా వచ్చిన ‘కలియుగం పట్టణంలో’ మూవీ రివ్యూ ఏంటి..? ఆడియన్స్ ని థ్రిల్ చేసిందా..?

Kaliyugam Pattanamlo Review : ‘కలియుగం పట్టణంలో’ రివ్యూ.. థ్రిల్లర్ సినిమాకి మదర్ సెంటిమెంట్..

Tollywood new thriller movie Kaliyugam Pattanamlo review and rating

Kaliyugam Pattanamlo Review : విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా కొత్త దర్శకుడు రమాకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కలియుగం పట్టణంలో’. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌లు నిర్మాతలుగా ఈ సినిమాని నిర్మించారు. ‘కలియుగం పట్టణంలో’ సినిమా నేడు మార్చి 29న రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఈ సినిమా కథ మూడు పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి మొదలవుతుంది. నంద్యాలలో నివసించే మోహన్ (దేవి ప్రసాద్), కల్పన (రూపాలక్ష్మి) దంపతులకు విజయ్, సాగర్ (విశ్వ కార్తికేయ డ్యూయల్ రోల్) అనే కవలలు పుడతారు. వీరిలో విజయ్ కి రక్తం అంటే భయం, సాగర్ కి ఇష్టం. ఆ రక్తం చూడడం కోసం సాగర్ తమ కాలనీలోని పెంపుడు జంతువులను చంపేస్తుంటాడు. దీంతో సాగర్ ని ఒక డాక్టర్ దగ్గరకి తీసుకువెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటారు. ఆ తర్వాత కొన్ని సంఘటనలతో మోహన్.. సాగర్ ని మెంటల్ హాస్పిటల్ కి పంపించేస్తాడు. కొంతకాలం తర్వాత ఒకే రూపంలో ఉండడం వల్ల విజయ్ ని మెంటల్ హాస్పిటల్ పెట్టి సాగర్ బయటకి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మరోపక్క శ్రావణి (ఆయుషి పటేల్) కి చిన్నతనం నుంచి మగవాళ్ళు అంటే కోపం. ఈ కోపంతో ఆడవారిని హింసించే మగవారిని శ్రావణి ఏం చేస్తుంది? మరో పక్క నంద్యాలలో ఆడపిల్లలు సూసైడ్ చేసుకుంటుంటారు. దానికి కారణం ఏంటని కనిపెట్టడం కోసం ఒక పోలీస్ ఆఫీసర్ (చిత్ర శుక్లా) ని తీసుకు వస్తారు. ఈ మూడు పాయింట్స్ మధ్య ఏమైనా కనెక్షన్ ఉందా..? విజయ్, సాగర్ ఎప్పుడు, ఎందుకు ప్లేస్ లు మారారు..? మగవారిపై కోపంతో శ్రావణి ఏం చేస్తుంది..? అమ్మాయిల సూసైడ్స్ కి కారణం పోలీస్ ఆఫీసర్ కనుక్కుందా అనేది.. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Also read : Pushpa 2 : ‘పుష్ప 2’ టీజర్ డేట్ ఫిక్స్.. ఆ రోజే రిలీజ్.. బన్నీ ఫ్యాన్స్‌కి పండగే..

కథ విశ్లేషణ.. మూడు పాయింట్ ఆఫ్ వ్యూస్ నుంచి స్టార్ట్ అయిన సినిమా ఇంటరెస్టింగ్ గానే సాగుతుంది. అయితే మూడు పాయింట్స్ ని ఒకేసారి చూపిస్తూ తీసుకు వెళ్తుండడంతో.. కథకి కనెక్ట్ అవ్వని వాళ్ళు కొంచెం తికమకపడే అవకాశం ఉంది. ఇక ఈ కథతో దర్శకుడు మంచి పాయింట్ నే ప్రెజెంట్ చేసారు. పిల్లలు పుట్టిన తరువాతే కాదు, వాళ్ళు గర్భంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పేరెంటింగ్ చేయాలి అనే పాయింట్ ని చెప్పారు. ఆ ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ లో సీక్వెల్ కి లీడ్ ఇస్తూ ఓ ట్విస్ట్ రివీల్ చేశారు.

నటీనటుల విషయానికొస్తే.. విశ్వ ఒక పక్క మంచి వాడిగా, మరో పక్క సైకోగా డ్యూయల్ రోల్ లో నటన పరంగా అదరగొట్టాడు అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ ఆయుషి పటేల్ కూడా రెండు షేడ్స్ పాత్రలో వావ్ అనిపించింది. తల్లిదండ్రులు పాత్రలు పోషించిన దేవి ప్రసాద్, రూపాలక్ష్మి తమ పాత్రలకు న్యాయం చేసారు. రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ గా చిత్ర శుక్లా అదుర్స్ అనిపించింది.

టెక్నీషియన్స్ విషయానికొస్తే.. దర్శకుడు మంచి పాయింట్ నే రాసుకున్నారు. అయితే స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. దాని మీద కొంచెం దృష్టిపెట్టి ఉంటే బెటర్ అనిపించింది. అజయ్ ఇచ్చిన మ్యూజిక్ సన్నివేశాలకు తగ్గట్టు బాగానే ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా బాగానే అనిపించింది. సినిమాటోగ్రఫీ కూడా అన్ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడంతో బాగా చూపించారు.

మొత్తం మీద కలియుగం పట్టణంలో ఒక థ్రిల్లర్ సినిమాని ఎమోషనల్ గా చూపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసారు. ఈ సినిమాకి 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.