విడుదలకు సిద్ధమైన విశ్వామిత్ర

మే లో విడుదల కానున్న విశ్వామిత్ర..

  • Published By: sekhar ,Published On : April 19, 2019 / 08:16 AM IST
విడుదలకు సిద్ధమైన విశ్వామిత్ర

Updated On : April 19, 2019 / 8:16 AM IST

మే లో విడుదల కానున్న విశ్వామిత్ర..

తమిళ నటుడు ప్రసన్న(నటి స్నేహా భర్త), నందితా రాజ్, విజయ్ చందర్, అశుతోష్ రాణా, సత్యం రాజేష్, విద్యుల్లేఖ రామన్ ప్రధాన పాత్రధారులుగా, ఫణి తిరుమలశెట్టి సమర్పణలో, రాజాకిరణ్ సినిమా, మధురం మూవీ క్రియేషన్స్ కలిసి నిర్మిస్తున్న సినిమా.. విశ్వామిత్ర.. కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి, గీతాంజలి, త్రిపుర, లక్కునోడు చిత్రాలను అందించిన రాజాకిరణ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే నెలలో సినిమాని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకి కెమెరా : అనిల్ బండారి, ఎడిటింగ్ : ఉపేంద్ర, మాటలు : వంశీకృష్ణ ఆకెళ్ళ, ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్, నిర్మాతలు : మాధవి అద్దంకి, ఎస్ రజినీకాంత్, రాజాకిరణ్.

వాచ్ విశ్వామిత్ర టీజర్..