Viswant Duddumpudi Katha Venuka Katha Crime Thriller Movie Streaming in ETV Win
Katha Venuka Katha : విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్ జంటగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘కథ వెనుక కథ’ సినిమా ఇటీవల ఈ విన్ ఓటీటీలోకి వచ్చింది. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పై దండమూడి అవనీంద్ర కుమార్ ఈ సినిమాని నిర్మించారు. శుభశ్రీ, ఆలీ, సునీల్, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం.. పలువురు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.
ఈ కథ వెనుక కథ సినిమా ఓ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కించారు. లైఫ్ లో డైరెక్టర్ అయి తన మరదలిని పెళ్లి చేసుకోవాలనుకునే హీరోకి దర్శకుడిగా సినిమా ఛాన్స్ వచ్చి సినిమా షూటింగ్ అయ్యాక హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలోని కొంతమంది మిస్ అయితే, అలాగే అదే సమయంలో సిటీలో పలు హత్యలు జరిగితే ఏం జరిగింది? ఆ హత్యలు ఎవరు చేసారు? హీరోకి వాటికి ఉన్న సంబంధం ఏంటి? అనే థ్రిల్లింగ్ అంశంతో సాగుతుంది.
Also read : Urfi Javed : ఉర్ఫీ జావేద్ సమ్మర్ స్పెషల్ అవుట్ ఫిట్ చూశారా.. ఫ్యాన్స్ ఎక్కడ పెట్టిందో చూశారా..!
ఈ విన్ ఓటీటీలో ఇటీవల వచ్చిన సినిమాలు, సిరీస్ లు మంచి వ్యూస్ తెచ్చుకొని సక్సెస్ అవుతున్నాయి. ఇదే క్రమంలో ఈ కథ వెనుక కథ కూడా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. తాజాగా దర్శక నిర్మాతలు కృష్ణ చైతన్య, అవనీంద్ర కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా ఈ విన్ ఓటీటీలో మంచి వ్యూస్ దక్కించుకొని, ఇంకా వ్యూయర్ షిప్ వస్తుంది అని తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసారు.