Bakasura Restaurant : నాన్న కల తీర్చడానికి దర్శకుడిగా మారి.. ‘బకాసుర రెస్టారెంట్’ సినిమా డైరెక్టర్.. తిండిపోతు దయ్యం కథతో..
హారర్ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సినిమా బకాసుర రెస్టారెంట్.

Bakasura Restaurant
Bakasura Restaurant : ఎస్‌జే మూవీస్ బ్యానర్ పై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్ ఆచారి నిర్మాణంలో ఎస్‌జే శివ దర్శకత్వంలో కమెడియన్ ప్రవీణ్ మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా ‘బకాసుర రెస్టారెంట్’. ఈ సినిమాలో వైవా హర్ష టైటిల్ రోల్‌లో నటిస్తుండగా కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హారర్ హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 8న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేడు దర్శకుడు ఎస్‌జే శివ మీడియాతో మాట్లాడుతూ.
డైరెక్టర్ ఎస్‌జే శివ సినిమా గురించి మాట్లాడుతూ.. బకాసుర రెస్టారెంట్ ఒక హంగర్ కామెడీ ఎంటర్‌టైనర్. తెలుగులో ఇదొక కొత్త జోనర్. ఇదొక తిండిబోతు కథ. రెస్టారెంట్ పెట్టాలని కలలు కనే ఓ యువకుడి కథ ఇది. ఈ అంశానికి హారర్, థ్రిల్లింగ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ అంశాలు జోడించాం. ఇది క్లీన్ కామెడీ సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చు. యమలీల, ఘటోత్కచుడులా ఆడియన్స్ థ్రిల్లింగ్‌గా ఫీలయ్యే కథ ఇది. మన జీవితంలోకి ఓ తిండిబోతు దెయ్యం వస్తే ఆ తిప్పలు ఎలా ఉంటాయి, ఐదుగురు బ్యాచిలర్స్ మధ్య జరిగే కామెడీ కథ ఇది అని తెలిపారు.
ఈ సినిమాలో హీరోగా కమెడియన్ ప్రవీణ్‌ను తీసుకోవడం, మిగిలిన ఆర్టిస్టుల గురించి మాట్లాడుతూ.. మొదట వేరే హీరోలతో డిస్కస్ చేశాం కానీ అందరూ సోలో హీరో కథలైతే చేస్తాం అన్నారు. కానీ ఈ కథ అలాంటిది కాదు. ఆ సమయంలోనే ప్రవీణ్ మెయిన్ లీడ్ లో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడని తెలిసి ఆయన్ని కలిపి కథ చెప్పాము. ఈ కథ వినగానే ప్రవీణ్ చేస్తాను అన్నాడు. వైవా హర్ష టైటిల్ రోల్ లో చేసాడు. కథను నమ్మి ఈ సినిమాను చేశాం. పెద్ద హీరోలను పెట్టినా ఇప్పుడు డబ్బులు తిరిగి వస్తాయని నమ్మకం లేదు. పెద్ద హీరోకు ఇవ్వాల్సిన పారితోషికం మేము మేకింగ్‌లో పెట్టి క్వాలిటీగా సినిమా తీశాం. నాలుగున్నర కోట్లతోనే ఈ సినిమా చేసాము అని తెలిపారు.
శివ తన గురించి చెప్తూ.. నేను లండన్‌లో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తిచేశాను. విరూపాక్ష సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను. గతంలో మా నాన్న గారు కొన్ని సినిమాలు నిర్మించి మోసపోయారు. మా అన్నయ్య కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ లో పనిచేశారు. మా నాన్న కోరిక మా ఇంట్లో ఒకరైనా డైరెక్టర్ అవ్వాలని, మంచి సినిమా తీయాలని. మా నాన్న కోరిక, కల తీర్చడం కోసమే నేను దర్శకుడిగా, మా అన్నయ్య నిర్మాతగా మారాము అని తెలిపాడు.
Also See : Kiara Advani : వార్ 2 సాంగ్ షూట్.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన కియారా అద్వానీ..
అలాగే.. మా సినిమాను శిరీష్ గారు చూసి మెచ్చుకున్నారు. ఈ సినిమా కథ గురించి ఆయన నాతో గంటసేపు మాట్లాడాడు. దిల్ రాజు గారికి చెప్పడంతో వాళ్ళే మా సినిమాని రిలీజ్ చేస్తున్నారు అని చెప్పారు.
ఇక తన సినిమా అనుభవం, తర్వాత సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమా తీయడం చాలా టఫ్. ఇక్కడ సినిమా బిజినెస్‌లో ఎవరైనా కథ ఏంటి, సినిమా ఎలా ఉంటుంది అని అడగట్లేదు. స్టార్ ఆర్టిస్టులు ఉన్నారా? ఖర్చు ఎంత పెట్టారు? ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్ కానీ దాని గురించి తప్ప అన్నీ అడుగుతున్నారు. నాకు విఠలాచార్య లాంటి సినిమాలు అంటే ఇష్టం. ఆ తరహా కథలతో సినిమాలు తీయాలని ఉంది. ప్రస్తుతం నా దగ్గర ఓ ఫ్యాక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కథ ఉంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా వచ్చి చాలా ఏళ్ళు అయింది. మళ్ళీ మా బ్యానర్ లో నేను సినిమా చేయను. మా ఎస్‌జే బ్యానర్‌లో కేవలం కొత్త దర్శకులకు మాత్రమే అవకాశం అని తెలిపారు.