Vivek Agnihotri : ఫోటోలు తీసుకోవడానికే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఈ కాలం పెళ్లిళ్లపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

తాజాగా కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ కాలం పెళ్లిళ్లపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Vivek Agnihotri : ఫోటోలు తీసుకోవడానికే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఈ కాలం పెళ్లిళ్లపై కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..

Vivek Agnihotri interesting tweet on these days Weddings

Updated On : May 15, 2023 / 8:08 AM IST

Vivek Agnihotri :  బాలీవుడ్(Bollywood) లో ఎప్పటినుంచో ఉన్నా కశ్మీర్ ఫైల్స్(Kashmir Files) సినిమాతో ఒక్కసారిగా ఇండియా(India) అంతా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ వివేక్ రంజాన్ అగ్నిహోత్రి(Vivek Ranjan Agnihotri). ఇక అప్పట్నుంచి మరింత లైం లైట్ లో ఉంటూ తన నుంచి రాబోయే సినిమాలతో, బాలీవుడ్ మాఫియాపై, బాలీవుడ్ ని రూల్ చేస్తున్న కొంతమంది స్టార్స్ పై రెగ్యులర్ గా కామెంట్స్ చేస్తూ మరింత వైరల్ అవుతున్నారు వివేక్. అప్పుడప్పుడు దేశంలో జరిగే పలు విషయాలపై కూడా తన ట్విట్టర్(Twitter) ద్వారా స్పందిస్తూ ఉంటారు.

తాజాగా కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఈ కాలం పెళ్లిళ్లపై ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. తన ట్వీట్ లో.. ఈ రోజుల్లో కేవలం ఫొటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్ అనే ట్యాగ్ కేవలం షో ఆఫ్ కోసం చేసుకుంటున్నారని నాతో ఓ వెడ్డింగ్ ప్లానర్ చెప్పాడు. నేను కూడా ఇటీవల ఓ డెస్టినేషన్ వెడ్డింగ్ కు వెళ్ళాను. అక్కడ ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తాడని ఎవరో చెప్పడంతో పెళ్లికూతురు స్పృహ తప్పి పడిపోయింది అంటూ తెలిపారు వివేక్.

Jabardasth Rohini : కాలిలో రాడ్ ఉండిపోయి హాస్పిటల్ లో నటి.. అవకాశాలు వస్తున్నప్పుడు ఇలా అయిందని బాధపడుతూ..

దీంతో వివేక్ అగ్నిహోత్రి చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నిజమే ఫొటోలు, వీడియోల హడావిడి ఎక్కువైంది అని అంటుంటే మరికొంతారు లైఫ్ లాంగ్ జ్ఞాపకాలుగా గుర్తుంచుకోవడానికి అలా తీయించుకుంటున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.