Jabardasth Rohini : కాలిలో రాడ్ ఉండిపోయి హాస్పిటల్ లో నటి.. అవకాశాలు వస్తున్నప్పుడు ఇలా అయిందని బాధపడుతూ..

జబర్దస్త్ లాంటి షోలో కూడా మెప్పించి సినిమాల్లో లేడీ కమెడియన్ గా కూడా ఛాన్సులు సంపాదిస్తోంది రోహిణి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో హాస్పిటల్(Hospital) లో చేరింది రోహిణి.

Jabardasth Rohini : కాలిలో రాడ్ ఉండిపోయి హాస్పిటల్ లో నటి.. అవకాశాలు వస్తున్నప్పుడు ఇలా అయిందని బాధపడుతూ..

Jabardasth Rohini Joined in Hospital and emotional video goes viral

Updated On : May 15, 2023 / 7:32 AM IST

Rohini : నటి రోహిణి సీరియల్స్(Serials) తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత బిగ్ బాస్(BiggBoss) తో మంచి ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ అనంతరం టీవీ షోలు, సిరీస్ లు, సినిమాలు ఇలా వరుస అవకాశాలు వస్తున్నాయి రోహిణికి. జబర్దస్త్ లాంటి షోలో కూడా మెప్పించి సినిమాల్లో లేడీ కమెడియన్ గా కూడా ఛాన్సులు సంపాదిస్తోంది రోహిణి. ప్రస్తుతం చేతి నిండా అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇలాంటి సమయంలో హాస్పిటల్(Hospital) లో చేరింది రోహిణి.

గతంలో తనకు యాక్సిడెంట్ అయిందని, అప్పుడు కాలిలో ఎముకకు సపోర్ట్ గా ఓ రాడ్ వేశారని, ఇప్పుడు అది నొప్పిగా ఉండటంతో తీయించుకుందామని వెళ్తే రాడ్ తీయడం కుదరదని, లోపలే ఇరుక్కుపోయింది రోహిణి తెలిపింది. ఇదంతా చెప్తూ, రోహిణి హాస్పిటల్ కి వెళ్లడం, హాస్పిటల్ బెడ్ పై నుంచి కూడా రోహిణి మాట్లాడుతూ చేసిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో రోహిణి మాట్లాడుతూ.. 2016 లో నాకు యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయితే కొన్ని నెలలు బెడ్ మీదే ఉన్నాను. అప్పుడు అమ్మే అన్ని చూసుకుంది. ఆ సమయంలో ఆపరేషన్ చేసి కాలు లోపల ఎముకకు సపోర్ట్ గా రాడ్ వేశారు. ఆ రాడ్ ఇన్నాళ్లు తీయించలేదు. కానీ ఇటీవల టీవీ షోలలో డ్యాన్స్ వేస్తుంటే కొంచెం నొప్పిగా ఉంటోంది. దాని వల్ల సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోతున్నాను. అందుకే రాడ్ తీయిద్దామని హాస్పిటల్ కు వచ్చాను. డాక్టర్స్ కూడా రాడ్ తీయడానికి ఆపరేషన్ కు రెడీ చేశారు. కానీ రాడ్ లోపల ఇరుక్కుపోయిందని, ఎంత ప్రయత్నించినా రాలేదని, ఒకవేళ బలంగా తీయాలని ప్రయత్నించినా ఎముక విరిగిపోతుందని చెప్పారు. దానికంటే తీయకపోవడమే మంచిదని, ఆ రాడ్ అలాగే ఉంచేయమని డాక్టర్లు చెప్పారు అని తెలిపింది.

Pooja Hegde : పూజా హెగ్డేకి ఎలాంటి వరుడు కావాలో తెలుసా? పూజా వాళ్ళ అమ్మ చెప్పేసింది..

అలాగే.. ఇప్పుడు షోలు, సినిమాలు, ఛాన్సులతో బిజీగా ఉన్నాను. ఇది తీపించుకుందాం అనుకోని ఆపరేషన్ దాకా వచ్చాను. ఇప్పుడు మళ్ళీ కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి. ఆ రాడ్ బయటకు రాలేదు, ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలా గ్యాప్ వచ్చింది. బయటకు నవ్వుతున్నా లోపల చాలా బాధగా ఉంది అని బాధపడుతూ మాట్లాడింది రోహిణి. దీంతో రోహిణి అభిమానులు, తోటి నటులు ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఫాస్ట్ గా టీవీలోకి రావాలని కోరుకుంటున్నారు.