Vivek Oberoi: పిక్చర్ అభీ బాకీ హై.. ‘స్పిరిట్’ సినిమాపై వివేక్ ఊరమాస్ కామెంట్స్.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
ప్రభాస్ స్పిరిట్ సినిమాలో తన పాత్ర గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi).
Vivek Oberoi Shocking Comments About Prabhas Spirit movie
- ప్రభాస్ సినిమా కోసం మార్ ప్రిపరేషన్
- స్పిరిట్ పై హైప్ ఎక్కిస్తున్న వివేక్ కామెంట్స్
- ఇప్పుడే మొదలయ్యింది అంటూ క్రేజీగా
Vivek Oberoi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ మూవీ ‘స్పిరిట్’. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలకమైన విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఒక ప్రెస్ మీట్లో వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ఈ సినిమా గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pragya Jaiswal: కవ్విస్తున్న కళ్లు.. మెరిసిపోతున్న అందాలు.. ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ అరాచకం!
ముఖ్యంగా ఈ చిత్రంలో తన పాత్ర, సినిమా స్థాయి గురించి ఆయన ఇచ్చిన సమాధానం అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ.. ‘యానిమల్’ సినిమాతో బాబీ డియోల్, ‘ధురంధర్’ చిత్రంతో అక్షయ్ ఖన్నా విలన్లుగా అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చారని, అలాగే మీరు కూడా ‘స్పిరిట్’తో స్ట్రాంగ్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అడిగారు.
దీనికి వివేక్ ఒబెరాయ్ తనదైన శైలిలో స్పందిస్తూ.. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్ (సినిమా ఇంకా బాకీ ఉంది మిత్రమా)” అంటూ బాలీవుడ్ డైలాగ్‌తో సమాధానమిచ్చారు. ‘స్పిరిట్’ సినిమా కోసం తాను ఇంకా చాలా కష్టపడాల్సి ఉందని, ఈ పాత్ర కోసం డెడికేషన్ తో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ మేకింగ్‌లో తన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందో వివేక్ మాటలు పరోక్షంగా స్పష్టం చేస్తున్నాయి. వివేక్ చేసిన ఈ కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద మరో విధ్వంసం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
