అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’ వీరి కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ చిత్రమిది. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా కంటే ముందు తమన్ సంగీత సారథ్యంలోని పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. లిరికల్ సాంగ్స్, వీడియో సాంగ్స్ ఒక్కొక్కటి వంద మిలియన్స్ క్రాస్ చేయడం విశేషం. ఈ సినిమాలో ‘‘బుట్టబొమ్మ’’ సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. ఇప్పటికే 280 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది.