Chitrapuri Colony : చిత్రపురి కాలనీ ఆరోపణలపై స్పందించిన అనిల్ కుమార్.. చిత్రపురి కాలనీ పై ఉన్న 170 కోట్ల అప్పు..

సినీ పరిశ్రమ వ్యక్తులకు చెందిన చిత్రపురి కాలనీపై గత కొన్నాళ్లుగా పలు ఆరోపణలు వస్తున్నాయి.

Chitrapuri Colony

Chitrapuri Colony : హైదరాబాద్ లోని సినీ పరిశ్రమ వ్యక్తులకు చెందిన చిత్రపురి కాలనీపై గత కొన్నాళ్లుగా పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడి చిత్రపురి కాలానికి సంబంధించిన విషయాలు మాట్లాడారు.

వల్లభనేని అనిల్ మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో కొంతమంది చిత్రపురి కాలనీ సమావేశంలో మాట్లాడకుండా చలో ఫిలిం ఛాంబర్, చలో గాంధీభవన్ అంటున్నారు. వారిలో అసలు చిత్రపురి కాలనీకి సంబంధం లేని వారు ఉన్నారు. చిత్రపురి కాలనీలో 4713 కుటుంబాలు ఉన్నాయి ఇప్పటికే. 700 నుండి 850 కోట్ల మధ్య ఉన్న చిత్రపురి కాలనీ పై 3000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు మాట్లాడుతున్నారు. చిత్రపురి కాలనీలో జాయిన్ కావాలంటే కచ్చితంగా సినీ కార్మికులయ్యే ఉండాలి. ప్రస్తుతం సుమారు 60 శాతం మాత్రమే అలా ఉన్నారు. కొంతమంది అమ్ముకుని బయటకు వెళ్లిపోయారు. అన్ని పర్మిషన్స్ తీసుకొనే కట్టాము. కాని కొంతమంది కేసులు పెట్టిన కారణంగా ఆ కట్టడాలు ఆపడం జరిగింది. కాలనీపై ఉన్న అప్పును దృష్టిలో పెట్టుకొని రేట్లు ఫిక్స్ చేసాము.

Also Read : Rekha Vedavyas : హమ్మయ్య హెల్త్ సెట్ అయింది.. రీ ఎంట్రీకి రెడీ.. మళ్ళీ మాములుగా మారిన ఆనందం హీరోయిన్..

శ్రావణమాసంలో కొత్త నిర్మాణాలు మొదలుపెట్టనున్నాము. సఫైర్ సూట్ నిర్మించబోతున్నాము. ఈ కొత్త ప్రాజెక్టు పూర్తి కాకపోతే కాలనీ మనుగడకే సమస్య వచ్చే అవకాశం ఉంది. చిత్రపురి కాలనీలో నీటి సమస్య లేదు. నిరంతరం మంజీరా నీటి సరఫరా ఉంటుంది. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా అందరికీ సరైన మెంబర్షిప్ లు ఉంటే కచ్చితంగా వారికి ఫ్లాట్ వచ్చేందుకు సహకరిస్తాం. ఆరోపణలు చేసేవారు వచ్చే నెలలో మీటింగ్ కల్లా వివరణ ఇవ్వాలి. చిత్రపురి కాలనీ పై ఉన్న 170 కోట్ల అప్పు కాలనీలోని సభ్యులపై పడదు. సినీ జర్నలిస్టులకు కూడా చిత్రపురిలో ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా సినీ జర్నలిస్టులకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు అలాగే 24 క్రాఫ్ట్స్ లో తమ అసోసియేషన్ ద్వారా వస్తే ఫ్లాట్లు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాము. సరైన సమయంలో డబ్బులు కట్టకపోవడం, సినీ కార్మికులు కాని వారిని తీసేస్తాము అని తెలిపారు.

Also Read : Rekha – Uday Kiran : నాతో పాటు ఉదయ్ కిరణ్ ఆ సూపర్ హిట్ సినిమా చేయాలి కానీ.. మా ఇద్దరి కాంబోలో రెండు సినిమాలు మిస్..