Rekha Vedavyas : హమ్మయ్య హెల్త్ సెట్ అయింది.. రీ ఎంట్రీకి రెడీ.. మళ్ళీ మాములుగా మారిన ఆనందం హీరోయిన్..

తాజాగా రేఖ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Rekha Vedavyas : హమ్మయ్య హెల్త్ సెట్ అయింది.. రీ ఎంట్రీకి రెడీ.. మళ్ళీ మాములుగా మారిన ఆనందం హీరోయిన్..

Image Credits : Nikhil Youtube Channel

Updated On : July 27, 2025 / 9:22 AM IST

Rekha Vedavyas : ఆనందం, ఒకటో నెంబర్ కుర్రాడు, జానకి వెడ్స్ శ్రీరామ్.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన రేఖ వేదవ్యాస్ తెలుగు, కన్నడలో వరుస సినిమాలు చేసి సడెన్ గా 2014 నుంచి సినిమాలకు దూరమయింది.

రెండేళ్ల క్రితం ఓ టీవీ షోలో కనిపించింది. ఫేస్ మారిపోయి, బక్కగా అయిపోయి అందర్నీ షాక్ కి గురిచేసింది రేఖ. అప్పుడే తనకు పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయని, డాక్టర్స్ ఇచ్చిన మందులు పడకపోవడంతో ఇలా తయారు అయ్యానని చెప్తూ ఎమోషనల్ అయింది. ఇప్పుడు తాజాగా రేఖ రీ ఎంట్రీ ఇస్తాను అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Also Read : Shobha Shetty : తన లవ్ స్టోరీ గురించి చెప్పిన బిగ్ బాస్ భామ.. పెళ్లి ఎప్పుడంటే? ఒప్పుకోకపోతే అతని వెనక తిరిగా..

ఈ ఇంటర్వ్యూలో రేఖ సినిమాలకు గ్యాప్, తన హెల్త్ సమస్యల గురించి మాట్లాడుతూ.. 2014 తర్వాత పర్సనల్ రీజన్స్ వల్ల సినిమాలకు దూరం అయ్యాను. కోవిడ్ ముందు సినిమాలు మళ్ళీ చేయాలి అనుకున్నాను. రీ ఎంట్రీ ఇచ్చే ముందు అలీతో సరదాగా షోకి వచ్చాను. ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత రీ ఎంట్రీ అవుతాను అనుకున్నాను. కానీ అది వచ్చిన వారం రోజులకే కోవిడ్ వచ్చింది. ఆ తర్వాత నేను హెల్త్ సమస్యలు చూసాను. మూడేళ్లు చాలా పెయిన్ చూసాను. చాలా బాధపడ్డాను హెల్త్ సమస్యల వల్ల. ఇప్పుడు కోలుకున్నాను. రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాను. సినిమాలు, షోలు, వెబ్ సిరీస్ లు.. ఏ ఛాన్స్ వచ్చినా చేస్తాను అని తెలిపింది. మరి ఒకప్పటి హీరోయిన్ రేఖకు ఛాన్సులు ఎవరు ఇస్తారో చూడాలి.

అయితే రెండేళ్ల క్రితం బక్కగా అయి, ఫేస్ మారిపోయి గుర్తుపట్టకుండా అయిన రేఖ ఇప్పుడు ఇంటర్వ్యూలో మళ్ళీ చక్కగా కనిపించడంతో ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమె ఇంటర్వ్యూ కింద కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Shobha Shetty – Sudeep : శోభా శెట్టికి కన్నడ స్టార్ హీరో సుదీప్ కు ఉన్న వివాదం ఏంటి? క్లారిటీ ఇచ్చిన శోభా శెట్టి..