Waheeda Rehman : సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2021.. ఎంపికైన బాలీవుడ్ సీనియర్ నటి..

కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2021 సంవత్సరానికి గాను సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని వహీదా రెహ్మాన్ కి ప్రకటించినట్లు అధికారికంగా తెలిపారు.

Waheeda Rehman : సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2021.. ఎంపికైన బాలీవుడ్ సీనియర్ నటి..

Waheeda Rehman Honoured with Dadasaheb Phalke Lifetime Achievement Award 2021

Updated On : September 26, 2023 / 3:26 PM IST

Waheeda Rehman Award :  సినీ రంగానికి తమ వంతు సేవలు అందించిన గొప్ప వారిలో ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఒకరికి అత్యున్నత సినీ పురస్కారం అయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు(Dadasaheb Phalke Lifetime Achievement Award) అందిస్తుంది. ఇటీవలే నేషనల్ ఫిలిం అవార్డ్స్(National Film Awards) ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ కేటగిరీలోనే ఇచ్చే దాదాసాహెబ్ ఫాల్కే లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డు ఈ సంవత్సరం బాలీవుడ్(Bollywood) సీనియర్ నటి వహీదా రెహ్మాన్ కి ప్రకటించారు.

కేంద్ర ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ 2021 సంవత్సరానికి గాను సినీ అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని వహీదా రెహ్మాన్ కి ప్రకటించినట్లు అధికారికంగా తెలిపారు. వహీదా రెహ్మాన్ 1950 ల్లోనే సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడుకి చెందిన ఈమె మొదట బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ గా పలు సినిమాల్లో కనిపించి తెలుగు సినిమా ఎన్టీఆర్ ‘జయసింహ’తో ఎంట్రీ ఇచ్చింది. అనంతరం వరుసగా హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయింది వహీదా రెహ్మాన్.

బాలీవుడ్ లో ప్యాసా, కాగజ్ కా పూల్, చద్విన్ కి చాంద్, షాగున్, గైడ్, రామ్ ఔర్శ్యం, పత్తర్ కా శనమ్, ఖామోషి, హిమ్మత్ వాలా, చాందిని, లమ్హే, రంగ్ దే బసంతి.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. దాదాపు 100కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది వహీదా రెహ్మాన్. వయసు పెరిగాక కూడా అడపాదడపా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. చివరిసారిగా 2021లో స్కెటర్ గర్ల్ అనే సినిమాలో కనిపించారు వహీదా రెహ్మాన్.

Also Read : అఖిల్ కోసం వస్తున్న రాజమౌళి.. అయ్యగారు ఈ సారైనా హిట్ కొడతారా?

వహీదా రెహ్మాన్ పలు నేషనల్, ఫిలిం ఫేర్ అవార్డులు, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించారు. కేంద్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు గుర్తించి గతంలోనే పద్మశ్రీ , పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇప్పుడు సినీ అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరిస్తుంది. దీంతో ఆమె అభిమానులు సంతోషిస్తున్నారు. వహీదా అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు వహీదా రెహ్మాన్ కి అభినందనలు తెలుపుతున్నారు.