Waltair Veerayya: వీరయ్య వైజాగ్.. వీరసింహారెడ్డి సీమ.. నిజమేనా?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ కొత్త సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ పండగకు బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొననుంది. ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా ఊరమాస్ మూవీతో చాలా రోజుల తరువాత చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Waltair Veerayya Veera Simha Reddy Pre-Release Events To Happen In These Places

Waltair Veerayya: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు తమ కొత్త సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ పండగకు బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోటీ నెలకొననుంది. ‘వాల్తేరు వీరయ్య’ అనే పక్కా ఊరమాస్ మూవీతో చాలా రోజుల తరువాత చిరు ఊరమాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానలు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.

Waltair Veerayya : ‘నువ్వు శ్రీదేవైతే..నేను చిరంజీవి’.. సాంగ్‌ లీక్‌ చేసిన మెగాస్టార్‌..

మరో స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తనకు ఎంతగానో కలిసొచ్చే ఫ్యాక్షన్ నేపథ్యంలో మరోసారి బాక్సాఫీస్ భరతం పట్టేందుకు రెడీ అయ్యాడు. ‘వీరిసింహారెడ్డి’ అనే పవర్‌ఫుల్ పాత్రలో బాలయ్య బాక్సాఫీస్ వద్ద రీసౌండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఇద్దరు హీరోలు కూడా కేవలం ఒక రోజు గ్యాప్‌లో థియేటర్లలో ల్యాండ్ అవుతున్నారు. కాగా, ఈ సినిమాలకు సంబంధించి తాజాగా ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి రన్‌టైమ్ ఫిక్స్.. ఎంతో తెలుసా?

ఈ రెండు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్‌లను ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఆయా చిత్ర యూనిట్‌లు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య వైజాగ్ నేపథ్యంలో సాగే కథ కావడంతో, ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకను వైజాగ్‌లో భారీ ఎత్తున నిర్వహించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. ఇక వీరసింహారెడ్డి మూవీ సీమ నేపథ్యంలో సాగుతుండటంతో.. సీమ ప్రాంతంలోని అనంతపురంలో ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అయితే రెండు కూడా పెద్ద సినిమాలు కావడంతో, ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నాలుగైదు రోజుల గ్యాప్‌లో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.