Veera Simha Reddy: వీరసింహారెడ్డి రన్‌టైమ్ ఫిక్స్.. ఎంతో తెలుసా?

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ డ్రామా మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy: వీరసింహారెడ్డి రన్‌టైమ్ ఫిక్స్.. ఎంతో తెలుసా?

Balakrishna Veera Simha Reddy Locks Runtime

Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యాక్షన్ డ్రామా మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ‘వీరసింహారెడ్డి’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Veera Simha Reddy : తన ‘సుగుణ సుందరి’ని అప్పుడే పరిచయం చేస్తానంటున్న బాలయ్య..

ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయగా, సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన రన్‌టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసిందట. ఈ సినిమా రన్‌‌టైమ్‌ను 2 గంటల 43 నిమిషాలకు లాక్ చేసింది చిత్ర యూనిట్.

Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో ఆ ఒక్కటే బ్యాలెన్స్..!

దీంతో ఈ సినిమాకు ఈ రన్‌టైమ్ ఎంతమేర హెల్ప్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గోపీచంద్ మలినేని ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.