NTR – War 2 : ఎన్టీఆర్‌ని కలిసిన వార్ 2 దర్శకుడు.. షూటింగ్ ఎప్పుడు మొదలు..?

వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ నేడు ఎన్టీఆర్ ని హైదరాబాద్ లో కలిశాడట. షూటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ గురించి..

War 2 director Ayan Mukerji met NTR at hyderabad for shooting update

NTR – War 2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ (Devara) సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ పూర్తి అయిన తరువాత వార్ 2 (War 2), NTR31 లో నటించాల్సి ఉంది. నందమూరి అభిమానులంతా వార్ 2 కోసం ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 2019లో హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వార్’కి ఇది సీక్వెల్ గా వస్తుంది. ఆ మూవీలో హృతిక్ అండ్ టైగర్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టేశారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అండ్ హృతిక్ తో ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో అని అందరిలో ఆసక్తి నెలకుంది.

దీంతో ఈ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ దర్శకుడు హైదరాబాద్ వచ్చి ఎన్టీఆర్ ని కలిశాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ లో భాగంగా తారక్ ని అయాన్ కలిసినట్లు తెలుస్తుంది. దేవర షూటింగ్ కి కంప్లీట్ అవ్వగానే వార్ 2 షూటింగ్ లో పాల్గొంటానని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నాడు.

Also Read : NTR Adhurs : చారి, భట్టు మళ్ళీ వస్తున్నారు.. అదుర్స్ రీ రిలీజ్ ఫిక్స్..

కాగా ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేయబోతున్నాడో అనేది తెలియాల్సి ఉంది. వార్ 2 మూవీ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతుంది. ఈ యూనివర్స్ లో సల్మాన్ ఖాన్ – టైగర్, షారుఖ్ ఖాన్ – పఠాన్ కూడా ఉన్నాయి. భవిషత్తులో ఎన్టీఆర్ తో కూడా బాలీవుడ్ లో సింగల్ హీరో మూవీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న దేవర షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చ్ వరకు జరిగే అవకాశం ఉందంటూ టాక్ వినిపిస్తుంది. ఆ తరువాతే వార్ 2 సెట్స్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తాడు.