NTR Adhurs : చారి, భట్టు మళ్ళీ వస్తున్నారు.. అదుర్స్ రీ రిలీజ్ ఫిక్స్..
చారి, భట్టు సందడిని మరోసారి థియేటర్స్ లో చూసేందుకు అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ రీ రిలీజ్ కి డేట్ ఫిక్స్ అయ్యింది.

NTR Nayantara Brahmanandam Adhurs re release update
NTR Adhurs : మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్, మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా ‘అదుర్స్’. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ఆది, సాంబ మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ మూవీ పై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఆ రెండు చిత్రాలను ఫ్యాక్షన్ డ్రామాతో తెరకెక్కించిన వినాయక్.. అదుర్స్ ని మాత్రం యాక్షన్ కామెడీ మిక్స్ చేసి ఒక రివెంజ్ డ్రామాతో వచ్చాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్.. నరసింహ, చారి పాత్రల్లో డ్యూయల్ రోల్ చేశాడు.
ఇక చారిగా ఎన్టీఆర్ తనలోని కామెడీ యాంగిల్ ని ఆడియన్స్ కి పరిచయం చేశాడు. బ్రహ్మానందంతో కలిసి ఎన్టీఆర్ ఓ రేంజ్ కామెడీ పండించాడు. భట్టుగా బ్రహ్మానందం, చారిగా ఎన్టీఆర్.. ఆడియన్స్ ని విపరీతంగా నవ్వించారు. ఇప్పటికి వీరి కాంబినేషన్ సీన్స్ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుండడంతో అభిమానులంతా ఈ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. గతంలోనే ఒకసారి రీ రిలీజ్ కి సిద్ధం చేసినా మళ్ళీ ఎందుకో వెనక్కి వెళ్ళింది. అయితే ఇప్పుడు వచ్చేందుకు సిద్ధమైంది.
Also Read : Devara : ఎన్టీఆర్ దేవర షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రత్నవేలు.. నడి సముద్రంలో..
ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చి 23 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ సందర్భంగా అదుర్స్ ని రీ రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు. నవంబర్ 18న ఈ మూవీని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. మరి చారి, భట్టు కోసం ఎదురు చూస్తున్న అభిమానులంతా థియేటర్ లో మరోసారి వారి అల్లరి చూడడానికి సిద్దంకండి. కాగా ఈ మూవీ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వి వి వినాయక్ కూడా ఈ మూవీ సీక్వెల్ తీసుకు వస్తాను అంటూ గతంలో వెల్లడించాడు. కానీ ఇప్పటివరకు ఎందుకో అది జరగలేదు.