MAA Election: ఒకే కుటుంబం నుండి వ్యక్తిగత విమర్శలు స్థాయికి!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 956 మంది సభ్యులున్న సంఘానికి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడనున్నట్లు..

MAA Election: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఎన్నికల తేదీపై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. 956 మంది సభ్యులున్న సంఘానికి ఇప్పటికే అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు నిలబడనున్నట్లు ప్రకటించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ, సీవీఎల్ నరసింహారావు మా ఎలక్షన్లలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా.. ఇందులో ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు ఇప్పటికే హేమాహేమీలతో తమ ప్యానెల్స్ ప్రకటించగా ఈ రెండు వర్గాల మధ్యే ప్రధానంగా పోరు సాగనున్నట్లు కనిపిస్తుంది.

Sarkaru Vaari Paata: మహేష్ కాన్ఫిడెన్స్.. పోకిరి రేంజ్ వైబ్స్ ఇస్తుందా?

గత నాలుగు నెలలుగా సాగుతూ వచ్చిన ఈ మా ఎన్నికల వ్యవహారం అప్పుడప్పుడు శృతి మించుతున్నట్లు కనిపించడం.. పెద్దలు జోక్యంతో మళ్ళీ సద్దుమణగడం లాంటి తతంగం షరామామూలే అన్నట్లుగా కనిపిస్తుంది. తామంతా ఒకటే కుటుంబం అనే వ్యాఖ్యల నుండి మీ వలన ఏంటి ఉపయోగం అనేవరకు చాలా పరుష వ్యాఖ్యలను కూడా విన్న సామాన్య ప్రజలకు ఈ ఎన్నికలలో మరింత తీవ్రమైన ఆరోపణలు వినిపించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే దీని తలుఖూ వాతావరణం కూడా ప్యానల్ సభ్యుల మధ్య కనిపిస్తుంది.

Mahesh Babu: బిగ్ సీ భారీ ప్లాన్స్.. ప్రచారకర్త సూపర్ స్టార్!

ఆ మధ్య ప్రకాష్ రాజ్ ప్యానల్ ప్రకటన సమయం, ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని సభ్యుల లేఖల సమయంలో ప్రధానంగా ఇండస్ట్రీలో కొందరి మధ్య మాటల యుద్ధం నడించింది. ఒకవిధంగా ‘మా’ నిధిని మీరు తిన్నారంటే.. మీరు తిన్నారనే ఆరోపణలు ఇండస్ట్రీలో కాకరేపాయి. అయితే ఆ తర్వాత పెద్దల జోక్యంతో తామంతా కళామతల్లి బిడ్డలమంటూ సినిమా డైలాగులు వినిపించినా తాజాగా మళ్ళీ మంచు విష్ణు ప్యానల్ ప్రకటనతో మళ్ళీ ఈ వ్యాఖ్యల పరంపర మొదలైంది.

Sankranti 2022: సంక్రాంతికి ధియేటర్లో సినిమాల దండయాత్ర!

పదవీ మీద అంత వ్యామోహం ఎందుకన్న సీనియర్ నటుడు బాబూమోహన్ ఓ వ్యక్తి తన సొంత ఊరిలో పోటీచేస్తే నాలుగు ఓట్లు రాలేదని.. ఇక ఇప్పుడు ఆయన మా అసోషియేషన్ లో పోటీచేస్తున్నాడని పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కాకరేపాయి. అంతకు ముందే ప్రకాష్ రాజ్ ప్యానల్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు విష్ణు ప్యానల్ నుండి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఎన్నికల వ్యవహారం సినీ పరిశ్రమలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఉత్కంఠ రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు