Mahesh Babu: బిగ్ సీ భారీ ప్లాన్స్.. ప్రచారకర్త సూపర్ స్టార్!

టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బిజినెస్ స్ట్రాటజీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే మహేష్ సినిమాలతో సంపాదించే దాంతో సమానంగా వ్యాపార ప్రకటనల ప్రచారకర్తగా..

Mahesh Babu: బిగ్ సీ భారీ ప్లాన్స్.. ప్రచారకర్త సూపర్ స్టార్!

Mahesh Babu

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరోలలో మహేష్ బిజినెస్ స్ట్రాటజీల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఎందుకంటే మహేష్ సినిమాలతో సంపాదించే దాంతో సమానంగా వ్యాపార ప్రకటనల ప్రచారకర్తగా సంపాదిస్తాడని అంటారు. ఇప్పటికే మహేష్ ఖాతాలో చాలా బ్రాండ్లు ఉండగా ఇప్పుడు కొత్తగా మరో మొబైల్ చైన్ రిటైల్ స్టోర్స్ బ్రాండ్ కూడా చేరింది. మొబైల్‌ రిటైల్‌ సంస్థ ‘బిగ్‌ సి’ కంపెనీ ప్రచారకర్తగా ప్రముఖ హీరో మహేశ్‌ బాబును నియమించుకున్నారు.

Naga Chaitanya-Samantha: ఫస్ట్ టైమ్ చైతూ డిస్టర్బ్.. మాటల్లో చూపించేశాడు!

బిగ్ సి సంస్థకు ఇప్పటివరకు హీరోయిన్లే అంబాసిడర్లుగా వ్యవహరించగా ఇప్పుడు మహేశ్ బాబు రూపంలో తొలిసారిగా ఓ హీరో బిగ్ సి సంస్థకు అంబాసిడర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎండీ మాట్లాడుతూ.. తమ సంస్థ మార్కెట్లో మరింత పట్టుసాధించడానికి విస్తరణ బాట పట్టిందని.. ఇందులో భాగంగా నూతనంగా ఏర్పాటు చేయనున్న స్టోర్లను చిన్న నగరాలకు విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. కరోనాతో కుదేలైన మొబైల్‌ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,000 కోట్లు, వచ్చే ఏడాది రూ.1,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

Big Boss 5: కాస్త ఎమోషన్..ఇంకాస్త రొమాంటిక్‌.. ప్రేమ పక్షుల గోరుముద్దలు!

ప్రస్తుతం 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తుండగా.. వచ్చే రెండేండ్ల కాలంలో ఈ సంఖ్య 4 వేలకు చేరుకోనున్నదన్నారు. ఇప్పటికే తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడుల్లో 250 స్టోర్లను ఏర్పాటు చేసిన సంస్థ.. తాజాగా వచ్చే రెండేండ్ల కాలంలో మరో 250 స్టోర్లను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.125 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు బాలు చౌదరి తెలిపారు.