#WeDontWantTheriRemake is still trending
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘గబ్బర్ సింగ్’ సినిమాతో మర్చిపోలేని హిట్టుని అందించిన దర్శకుడు హరీష్ శంకర్.. ట్విట్టర్ లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు. నిన్న ఈ స్టార్ డైరెక్టర్ చేసిన ఒక ట్వీట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ‘పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఒక బిగ్ అనౌన్స్‌మెంట్ రాబోతుంది వెయిట్ చేయండి’ అంటూ ట్వీట్ చేశాడు. మొదట ఆ న్యూస్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా గురించి అని అందరూ భావించారు.
Harish Shankar : హరిష్ శంకర్ కి పవన్ ఫ్యాన్స్ సూసైడ్ నోట్..
అయితే ఇంతలో కొంతమంది నెటిజెన్లు అది ‘తేరీ’ రీమేక్ అనౌన్స్‌మెంట్ అంటూ కామెంట్లు చేయడం, కొన్ని వెబ్‌సైట్ లు కూడా అదే వార్తలు రాయడంతో పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే పవన్ వరసగా రెండు రీమేక్ లు.. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీమేక్ సినిమాలతో విసుగుపోయిన ఫ్యాన్స్ #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు.
నిన్న మొదలైన ఈ గందరగోళం ఇవాళ్టికి కూడా ట్రెండింగ్ లోనే ఉంది. తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరీ’ సినిమా తెలుగులో ‘పోలీసోడు’గా డబ్ అయ్యి విడుదలైంది. టీవిలో కూడా నెలలో ఒకటికి రెండు సార్లు వేస్తుంటాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. కొంతమంది అభిమానులు అయితే సూసైడ్ చేసుకుంటామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. కానీ ఈ విషయంపై హరీష్ శంకర్ గాని, మైత్రి మూవీ మేకర్స్ గాని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంలేదు.