Harish Shankar : హరిష్ శంకర్ కి పవన్ ఫ్యాన్స్ సూసైడ్ నోట్..
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసే అభిమానులు.. ఇప్పుడు సినిమా వద్దు అంటూ గొడవ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం డైరెక్టర్ హరీష్ శంకర్...

Pawan fans suicide note to Harish Shankar
Harish Shankar : పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో సినిమా కోసం ఎంతగానో ఎదురుచూసే అభిమానులు.. ఇప్పుడు సినిమా వద్దు అంటూ గొడవ చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం డైరెక్టర్ హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా పవన్ సినిమా గురించి ఒక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలియజేశాడు. అయితే ఆ అప్డేట్ ‘భవదీయుడు భగత్‌సింగ్’ సినిమా గురించి అని అనుకున్నారు అందరూ.
Pawan Kalyan: హరీష్ శంకర్ అనౌన్స్‌మెంట్.. వద్దు బాబోయ్ అంటోన్న పవన్ ఫ్యాన్స్!
అయితే అది తమిళ హీరో విజయ్ నటించిన ‘తేరీ’ సినిమా రీమేక్ అని సోషల్ మీడియా కొందరు కామెంట్లు చేయడంతో.. ట్విట్టర్ లో చర్చ మొదలయింది. ఇప్పటికే వరసగా ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ సినిమాలతో విసుగుపోయిన ఫ్యాన్స్, మళ్ళీ రీమేక్ వద్దు అంటూ గోల చేస్తున్నారు. పైగా తేరీ సినిమా ఆల్రెడీ ‘పోలీసోడు’ టైటిల్ తో తెలుగులో డబ్ అయ్యి విడుదలయింది.
దీంతో ఒక అభిమాని దర్శకుడు హరీష్ శంకర్ కి, మైత్రి మూవీ మేకర్స్ కి సూసైడ్ నోట్ రాసి సొసైల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “నెలలో రెండు వారాలకి ఒకసారి పోలీసోడు సినిమాను టీవీలో వేస్తానే ఉంటారు. ఇప్పుడు గనుక మీరు ఆ సినిమా తీస్తే, నా చావుకి కారణం హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్. ప్లీజ్ ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసేయండి” అంటూ పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ గా మారింది. అసలు మూవీ టీమ్ ఎటువంటి అప్డేట్ ఇవ్వనుంది అనేది మాత్రం ఇంకా తెలియలేదు.
Emotions tho Games Odu Anna ?#WeDontWantTheriRemake pic.twitter.com/WvTKPEiKqv
— Hᴀʀɪ PᴀᴡᴀɴɪꜱM ? (@HARI_PawanISM_1) December 8, 2022