×
Ad

Ntr: బక్కగా, పీలగా మారిపోయిన ఎన్టీఆర్.. అసలు ఏమయ్యింది.. ఆరోగ్య సమస్యలే కారణమా?

సినిమాల కోసం హీరోలు ఎంతలా కష్టపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. (Ntr)పాత్రకు తగ్గట్టుగా తమ దేహాన్ని మార్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

What happened to Jr NTR.. any health issues_

Ntr: సినిమాల కోసం హీరోలు ఎంతలా కష్టపడతారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత్రకు తగ్గట్టుగా తమ దేహాన్ని మార్చుకోవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ మధ్య స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం చాలా దారుణంగా కనిపిస్తున్నాడు. బక్కచిక్కిపోయి సన్నగా, పీలగా (Ntr)తయారైపోయాడు. దానికి సంబందించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఈ కామెంట్స్ అన్నీ తన బావమరిది నార్నే నితిన్ పెళ్లితో మొదలయ్యాయి.

Prabhas: ఆశపెట్టి ఆపేస్తున్నారు.. ఆ ప్రాజెక్టు ఇక లేనట్టే.. పాపం ప్రభాస్ ఫ్యాన్స్..

ఈ పెళ్ళిలో ఎన్టీఆర్ గతంలో కంటే చాలా సన్నబడి కనిపించాడు. పెళ్లి విషయం పక్కకి వెళ్లిపోయే ఎన్టీఆర్ లుక్స్ గురించే పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది. ఎప్పుడూ ఫుల్ జోష్‌తో, ఎనర్జిటిక్‌గా ఉండే ఈ స్టార్.. ఆ పెళ్లిలో సన్నబడి, నీరసంగా కనిపించాడు. దీంతో ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే, కాంతార చాప్టర్ 1 ఈవెంట్‌లో కూడా ఆలాగే కనిపించాడు. దీంతో, అసలు ఎన్టీఆర్ కు ఏమైంది? ఇంత దారుణంగా ఎందుకు మారిపోయాడు? అనే ప్రశ్నలు మొదలయ్యాయి. సోషల్ మీడియాలో కొంతమంది ఎన్టీఆర్ హెల్త్ బాలేదని? ఆరోగ్యం ఓకేనా? సడెన్‌గా ఎందుకు ఇంత సన్నగా, పేషెంట్‌లా తయారయ్యాడు? అనే కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఇన్ని వార్తలు వైరల్ అవుతున్నా.. ఎన్టీఆర్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రావడం లేదు.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు.. ఎన్టీఆర్ సన్నబడటానికి కారణం హెల్త్ ప్రాబ్లమ్స్ కాదట. ఎన్టీఆర్ హెల్త్ పర్ఫెక్ట్‌గా ఉందని సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు ఎన్టీఆర్. వాటిలో ఒకటి తండ్రి పాత్ర కాగా.. రెండవది కొడుకు పాత్ర. ప్రస్తుతం కొడుకు పాత్రకు సంబందించిన షూట్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్. కేవలం, ఈ పాత్రలో పర్ఫెక్షన్ కోసమే ఎన్టీఆర్ ఈ కొత్త లుక్‌లోకి మారాడట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ క్లోజ్ సోర్సెస్ కన్ఫర్మ్ చేశాయి.

ఈ పాత్ర కోసం 2025 ఫిబ్రవరి నుంచే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నాడట ఎన్టీఆర్. కొన్ని నెలల నుంచి ఈ డైట్ ను ఫాలో అవుతుండటంతో ఎన్టీఆర్ ఇలా మారిపోయాడని చెప్తున్నారు. ఎన్టీఆర్ ఇలా పాత్రల కోసం బాడీ మార్చుకోవడం మొదటిసారి కాదు.. యమదొంగ, కంత్రి, అరవింద సమేత,ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల కోసం ఎన్టీఆర్ తనను తాను సూపర్ లుక్ లోకి మలుచుకున్నాడు. అలాగే, డ్రాగన్ సినిమా కూడా తన బాడీని మార్చుకున్నాడు ఎన్టీఆర్.