సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న భారీ బడ్జెట్ సినిమాలు, హీరోల రెమ్యునరేషన్లు..! వారు మారాల్సిన సమయం వచ్చేసిందా?

గట్టిగా లెక్కేసి చూస్తే పెద్ద హీరో సినిమా వచ్చి ఎన్నాళ్లైంది. రాబోయేది ఎన్నాళ్లకు వస్తుంది? పెరుగుతున్న బడ్జెట్ లు, పెంచుకున్న రెమ్యునరేషన్లు.. సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి.

Film Industry In Crisis (Photo Credit : Google)

Film Industry Crisis : హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్థంలేనితనం, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం.. వీటన్నింటి మధ్యలో ఓ మంచి సినిమా రావడం అంటే మామూలు విషయం కాదు. ఇన్ని ఇబ్బందుల మధ్య హీరోల రెమ్యునరేషన్లు సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి. ఇండస్ట్రీని పక్కదారి పట్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ మూవీస్ పరిశ్రమ కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. అసలు ఎందుకీ పరిస్థితి? కరణ్ చెప్పినట్లు, గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు.. మార్పు మొదలు కావాల్సిందేనా? లేక సినీ పరిశ్రమ ఉనికే ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉందా?

గట్టిగా లెక్కేసి చూస్తే పెద్ద హీరో సినిమా వచ్చి ఎన్నాళ్లైంది. రాబోయేది ఎన్నాళ్లకు వస్తుంది? పెరుగుతున్న బడ్జెట్ లు, పెంచుకున్న రెమ్యునరేషన్లు.. సినిమాను మరింత భారంగా మారుస్తున్నాయి. నిర్మాతకు తడిసి మోపెడు అయ్యేలా చేస్తున్నాయి. ఇంత ఖర్చు పెట్టాము కదా.. కలెక్షన్లు ఆ లెవెల్ లోనే ఉంటాయా అంటే.. అది నిర్మాత అదృష్టమే మరి. పదుల, 100 కోట్లకు పెరిగిన హీరోల రెమ్యునరేషన్లు.. ఇప్పుడు ఇండస్ట్రీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్న పరిస్థితి. ఇంకా చెప్పాలంటే ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నాయి.

Also Read : నాపై కుట్ర జరిగింది..!- పోలీస్ కస్టడీలో కీలక విషయాలు చెప్పిన జానీ మాస్టర్..!

హీరోల తాలూకు ఇమేజ్ పేరుతో వందల కోట్లకు తోడు డైరెక్టర్ల తాలూకు అర్థంలేని తనం సినిమాను మరింత భారంగా మారుస్తోంది. భారీ అంటూ సినిమాను భారంగా మార్చేసి ఇండస్ట్రీని దెబ్బతీస్తున్న సీన్ కనిపిస్తోంది. అంత ఖర్చు పెట్టి ధీమాగా ఉండొచ్చా అంటే.. హిట్ సినిమాకు స్టార్లు గ్యారెంటీ కాదు అంటూ సైఫ్ అలీఖాన్ లా ఈజీగా ఓ మాట అనేస్తూ చేతులు దులిపేసుకుంటున్నారు.

పాన్ ఇండియా పోటీలో పడి కథను పక్కన పెడుతున్నారు. పారితోషికాలు పెంచేసి ఆ భారాన్ని జనాల మీదకు తోసేస్తున్నారు. ఈ ప్రభావం అంతా ఇండస్ట్రీ మీద పడేలా కనిపిస్తోంది. రెమ్యునరేషన్ల వ్యవహారం ఇండస్ట్రీని ముంచేసే పరిస్థితి కనిపిస్తోంది.

హీరోలు, డైరెక్టర్లు ఇప్పటికైనా మారాలా? ఇండస్ట్రీలో ఈ పరిస్థితికి కారణమేంటి? రెమ్యేనరేషన్లు ఇండస్ట్రీని ఎలా దెబ్బతీస్తున్నాయి? రెమ్యునరేషన్ విషయంలో తగ్గితే తప్పేంటి? హీరోల రెమ్యునరేషన్లు, నిర్మాతల ఇబ్బందులపై తమిళ డైరెక్టర్ వెట్రామారన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచించేలా చేస్తున్నాయి. హీరోల రెమ్యునరేషన్లు, సినిమా బడ్జెట్ పెరగటంలో ఓటీటీలు ప్రధానంగా కారణం అవుతున్నాయని క్లియర్ కట్ గా చెప్పేశాడు. ఏ దర్శకుడు అయినా థియేటర్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా తెరకెక్కించాలని, మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారని చెప్పుకొచ్చాడు వెట్రి. కొందరు డైరెక్టర్లపై ఇండైరెక్ట్ గా సెటైర్లు వేశాడు. హీరో ఇమేజ్ అడ్డం పెట్టుకుని ఏళ్లకు ఏళ్లు సినిమాను సాగదీస్తూ ఎలివేషన్లు మాత్రమే చూపిస్తే ప్రతీసారి వర్కౌట్ కాదు.

పూర్తి వివరాలు..