నాపై కుట్ర జరిగింది..!- పోలీస్ కస్టడీలో కీలక విషయాలు చెప్పిన జానీ మాస్టర్..!

ఆమె టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది.

నాపై కుట్ర జరిగింది..!- పోలీస్ కస్టడీలో కీలక విషయాలు చెప్పిన జానీ మాస్టర్..!

Jani Master Case (Photo Credit : Google)

Updated On : September 27, 2024 / 7:17 PM IST

Jani Master Case : అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో మూడో రోజూ జానీ మాస్టర్ ను పోలీసులు విచారించారు. ఇప్పటికే బాధితురాలి నుంచి రెండుసార్లు స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన పోలీసులు ఆ వివరాల ఆధారంగా జానీని ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీసుల కస్టడీలో జానీ కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది.

తనపై బాధితురాలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు జానీ. ఓ టీవీ ప్రోగ్రామ్ ద్వారా తనకు తానుగా ఆమె పరిచయం చేసుకుందని జానీ తెలిపినట్లు సమాచారం. మైనర్ గా ఉన్న సమయంలో ఆమెపై లైంగిక దాడి చేశాననేది అబద్ధం అని, ఆమె టాలెంట్ ను గుర్తించి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చినట్లు పోలీసులకు జానీ మాస్టర్ చెప్పినట్లు తెలుస్తోంది. తనను పెళ్లి చేసుకోవాలని బాధితురాలు మానసికంగా ఎంతో హింసించేదని, ఎన్నోసార్లు బాధితురాలు తనను బెదిరించిందని చెప్పారు జానీ. ఆ యువతి తీరుతో తానే చాలాసార్లు బాధపడ్డానన్నారు. తాను పడుతున్న ఇబ్బందిని డైరెక్టర్ సుకుమార్ కు కూడా చెప్పానన్నారు.

Also Read : ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ.. యువకుడి మృతిపై ఆరోగ్య శాఖ దర్యాప్తు..!

సుకుమార్ పిలిచి మాట్లాడినప్పటికీ బాధితురాలిలో మార్పు రాలేదన్నారు. తనపై కుట్ర జరిగిందని, దీని వెనుక ఎవరో ఉన్నారని, తన ఎదుగుదలను ఓర్వలేకనే తనను ఈ కేసులో ఇరికించారని పోలీసుల ఎదుట జానీ మాస్టర్ వాపోయినట్లు సమాచారం.

జానీ మాస్టర్ వ్యవహారం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారమే రేపింది. ఈ వివాదంలో పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. మూడో రోజు కస్టడీలో భాగంగా జానీని సుదీర్ఘంగా విచారించిన పోలీసులు.. అతడి స్టేట్ మెంట్ ను నమోదు చేసుకున్నారు. రంగారెడ్డి కోర్టు జానీ మాస్టర్ నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించిన సంగతి తెలిసిందే. చంచల్ గూడ జైల్లో జుడీషియల్ రిమాండ్ లో ఉన్న జానీని.. పోలీసులు దాదాపు మూడు రోజులు నార్సింగి పోలీస్ స్టేషన్ లో విచారించారు. కొన్ని అనారోగ్య కారణాల వల్ల జానీకి వైద్య పరీక్షలు చేశారు. ఉదయం నుంచి సుదీర్ఘంగా జానీని ఎంక్వైరీ చేశారు పోలీసులు. జానీ తనను లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగానే పోలీసులు.. జానీని సుదీర్ఘంగా విచారించారు.