Fake Collections : టాలీవుడ్లో ఫేక్ కలెక్షన్స్ ట్రెండ్ ఆగేదెప్పుడు?
హీరోల ఫ్యాన్స్‌ను ఖుషి చేయాలనే పేరుతో కొంతమంది ప్రొడ్యూసర్స్ (Fake Collections )చూపిస్తున్న డిజిట్స్ షాకింగా ఉన్నాయి.
When will fake collections trend end in Tollywood
Fake Collections : టాలీవుడ్లో సినిమా కలెక్షన్స్ కథ అంతా.. సినిమాను మించి సినిమాను తలపిస్తోంది. సినిమా హిట్ అయినా ఫ్లాప్‌తో సంబంధం లేకుండా రాని కలెక్షన్లు వచ్చినట్లు చూపించడం ట్రెండ్ అయిపోయిందట. రిలీజ్ రోజే 100 కోట్లు వసూళ్లంటూ పోస్టర్లు వేస్తూ..స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను నిర్మాతలు మోసం చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.
హీరోల ఫ్యాన్స్‌ను ఖుషి చేయాలనే పేరుతో కొంతమంది ప్రొడ్యూసర్స్ చూపిస్తున్న డిజిట్స్ షాకింగా ఉన్నాయి. సినిమాల కలెక్షన్స్ విషయంలో పోస్టర్లలో ఫేక్ ఫిగర్స్ చూపించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు వస్తున్నాయి. అసలు బాక్సాఫీస్ నంబర్స్ ఒకలా ఉంటే, పోస్టర్లపై మాత్రం భారీ కలెక్షన్స్ చూపించడంతో ఫ్యాన్స్ ఆనందపడినా.. నిజం బయటకు వచ్చిన తర్వాత అదే ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారన్న టాక్ ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేక్ కలెక్షన్స్‌ను బేస్ చేసుకొని ఫ్యాన్స్ వార్‌కు దిగుతుండటం వైరల్ అవుతోంది.
Vasavi Ganeshan : సింపుల్ లుక్‌లో ‘హుషారు పిట్టలు’ హీరోయిన్.. వాసవి గణేషన్ ఫోటోలు..
ప్రొడ్యూసర్స్ అసలు కలెక్షన్స్ కంటే డబుల్ ట్రిబుల్ ఎక్కువ చూపిస్తున్నారనే టాక్ టాలీవుడ్లో వినిపిస్తుంది. కానీ సినిమా ఆ రేంజ్ ఉండటం లేదట. కలెక్షన్స్ కూడా అంతలా లేవని ఆడియన్స్‌కు అర్థమైపోతున్న పరిస్థితి. అయినా బోలెడన్ని కలెక్షన్స్ అంటూ ఊదరగొడుతుండటంతో.. ఏ సినిమాకు ఎన్ని కలెక్షన్లు వచ్చాయో..ఏది హిట్టో..ఏ మూవీ ఫట్టో తెలియక అంతా అయోమయం కొనసాగుతోందట.
ఫేక్ కలెక్షన్స్ వల్ల హీరోల క్రెడిబిలిటీకి కూడా డ్యామేజ్ జరుగుతుందట. నిజాయితీగా ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పేస్తే వచ్చే నష్టం ఏంటనే ప్రశ్నలు కూడా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. కొంతమంది ఫ్యాన్స్ అయితే హిట్ అయితే హిట్, ఫ్లాప్ అయితే ఫ్లాప్ చెప్పుకుండా..నంబర్స్ మేకప్ చేయాల్సిన అవసరం ఏంటంటూ ఓపెన్‌గా కామెంట్ చేస్తున్నారు. ఈ ఫేక్ కలెక్షన్స్ కల్చర్ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి.
