Tollywood Directors : ఈ డైరెక్టర్స్ మళ్ళీ ఎప్పుడు సినిమాలు తీస్తారు?
టాలీవుడ్ డైరెక్టర్స్ కొందరు సరైన అవకాశం కోసం చూస్తున్నారు. ఏ హీరో అయినా ఛాన్స్ ఇస్తే ఈసారి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం పక్కా అంటున్నారు. హిట్ కొట్టినా, ఫ్లాప్ తగిలినా ముందుకెళ్లలేకపోతున్న టాలీవుడ్ డైరెక్టర్స్ కొంతమంది..........

Directors (1)
Tollywood Directors : టాలీవుడ్ డైరెక్టర్స్ కొందరు సరైన అవకాశం కోసం చూస్తున్నారు. ఏ హీరో అయినా ఛాన్స్ ఇస్తే ఈసారి మళ్ళీ ప్రూవ్ చేసుకోవడం పక్కా అంటున్నారు. హిట్ కొట్టినా, ఫ్లాప్ తగిలినా ముందుకెళ్లలేకపోతున్న టాలీవుడ్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు.
సాహోతో ప్రభాస్ ను డైరెక్ట్ చేసి ఒక్కసారిగా నేషనల్ లైమ్ లైట్ లోకి వచ్చాడు డైరెక్టర్ సుజిత్. బట్ హిందీ ప్రేక్షకులను సాహో మెప్పించినా ఇక్కడివారికి పెద్దగా కనెక్ట్ కాలేదు. సో రెబల్ స్టార్ తో సినిమా తర్వాత ఇంతవరకు మరో సినిమాకు సైన్ చేయలేదు సుజిత్. కొందరు హీరోలకు కథలు వినిపించినా అవి వర్కవుట్ కాలేదు. నెక్ట్స్ పవన్ కల్యాణ్ తో సినిమా చేస్తాడనే గాసిప్స్ వినిపించాయి. సుజిత్ లిస్ట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు కూడా వినిపించింది. కానీ ఏది వర్క్ అవుట్ అవ్వక ఇంకా నెక్స్ట్ సినిమా ఓకే అవ్వలేదు. సుజిత్ లాగానే ప్రభాస్ తో సినిమా చేసి ఢీలాపడ్డ డైరెక్టర్ రాధాకృష్ణ. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన రాధేశ్యామ్ ఆడియెన్స్ ను అలరించలేకపోయింది. దీంతో ఈమధ్యకాలంలో బయటికి కూడా రాలేకపోతున్నాడు రాధాకృష్ణ. మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తోన్న ఈ డైరెక్టర్ కు ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి మరి.
ఇక ఈ మధ్యకాలంలో హిట్ ఇస్తున్న దర్శకులకు కూడా ఎందుకనో మళ్ళీ అవకాశాలు దక్కడం లేదు. అలా రేస్‌లో వెనకబడిపోతున్నారు కొందరు డైరెక్టర్స్. అలాంటి వారిలో కళ్యాణ్ కృష్ణ కురసాల ఒకరు. అక్కినేని హీరోలతో సినిమాలు చేసి గట్టెక్కిన కల్యాణ్ ఇటీవల బంగార్రాజుతో మంచి వసూళ్లనే రాబట్టాడు. కానీ నెక్ట్స్ సినిమా ఏంటంటే మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఇంకా నెక్స్ట్ సినిమా ఓకే అవ్వలేదు.
NTR-Mahesh-Bunny : రిలాక్స్ మోడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమాలు ఎప్పుడు మొదలుపెడతారు??
అక్కినేని అఖిల్ కు మొదటి హిట్ ఇచ్చి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో తను కూడా కమ్ బ్యాక్ అయ్యాడు బొమ్మరిల్లు భాస్కర్. అయితే తర్వాతి సినిమా ఎవరితో అన్నదానిపై ఇంతవరకూ క్లారిటీ లేదు. నాగచైతన్యతో ఓ ఫ్యామిలీ డ్రామా ప్లాన్ చేసినట్టు రూమర్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత మళ్లీ అఖిల్ తోనే భాస్కర్ సినిమా చేస్తున్నాడనీ చెప్తున్నారు. ఏదేమైనా బొమ్మరిల్లు భాస్కర్ నుంచి అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు. మరి భాస్కర్ మళ్ళీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తాడో.

టాలీవుడ్ స్టార్స్ తో ఒకప్పుడు వరుస సినిమాలు చేసి, వరుస హిట్లు ఇచ్చి ఇప్పుడు సైలెంట్ అయిన డైరెక్టర్ శ్రీనువైట్ల. రవితేజతో తీసిన అమర్ అక్బర్ అంటోనీ తర్వాత శ్రీనువైట్ల నుంచి సౌండ్ లేదు. మంచు విష్ణుతో ఢీ సీక్వెల్ చేస్తున్నట్టు ఆ మధ్య బాగానే సందడి చేసాడు కానీ ఎందుకో మళ్లీ ఢీ సీక్వెల్ నుంచి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. మరో హీరోతో సినిమా చేస్తున్నట్టు న్యూస్ కూడా లేదు. బ్రహ్మోత్సవంతో కథ అడ్డం తిరిగిన శ్రీకాంత్ అడ్డాల చాలా గ్యాప్ తర్వాత వెంకీతో నారప్పను తీసాడు. ఓటీటీకే పరిమితమైన ఈ రీమేక్ మూవీ మంచి పేరే తెచ్చుకుంది కానీ శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించలేదు. రచయితగా కూడా మంచి పేరున్న ఈ దర్శకుడికి అవకాశం ఇచ్చేందుకు ఏ హీరో ముందుకు రావడం లేదు.
Movies : పాన్ ఇండియా సినిమాలు.. ఒత్తిడిలో దర్శకులు..
అల్లుడు అదుర్స్ తర్వాత సంతోశ్ శ్రీనివాస్ నుంచి కూడా అప్ డేట్ రాలేదు. కందిరీగ తప్పితే కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లేని సంతోశ్ శ్రీనివాస్ కు అవాకాశాలు అప్పట్లో వచ్చాయి కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో చేసిన అల్లుడు అదుర్స్ తర్వాత హీరోలెవరూ ఈ దర్శకుడిని కన్సిడర్ చేయట్లేరు. సో సంతోశ్ శ్రీనివాస్ కిప్పుడు కమ్ బ్యాక్ మూవీ కావాలి. ఖిలాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న రమేశ్ వర్మకు చివరికి నిరాశే మిగిలింది. తమిళ్ రీమేక్ రాక్షసుడు తర్వాత రమేశ్ వర్మకు అవకాశం ఇచ్చారు రవితేజ. కానీ ఖిలాడీతో సక్సెస్ సాధించలేకపోయారు. మరి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటంటే రమేష్ వర్మ దగ్గర్నుంచి సమాధానం లేదు.
పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ తర్వాత వేణూశ్రీరామ్, భీమ్లానాయక్ తర్వాత సాగర్ చంద్ర కూడా బిజీ కాలేకపోయారు. ఆడవాళ్లు మీకు జోహార్లు తర్వాత కిషోర్ తిరుమల నుంచి కూడా ఇంకా నెక్స్ట్ ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. మారిన ప్రేక్షకుడి అభిరుచికి తగ్గట్టు సినిమాలు చేస్తేనో ఇంకేదో కొత్తదనం చూపిస్తేనో ఇండస్ట్రీలో మనుగడ సాధ్యం. మరి ఈ డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమాలు ఎప్పుడు వస్తాయో, మళ్ళీ కంబ్యాక్ ఎప్పుడు ఇస్తారో చూడాలి.