NTR-Mahesh-Bunny : రిలాక్స్ మోడ్‌లో ఈ ముగ్గురు స్టార్ హీరోలు.. సినిమాలు ఎప్పుడు మొదలుపెడతారు??
పుష్ప సినిమా వచ్చి సిక్స్ మంత్స్ క్రాస్ అయిపోయింది. ట్రిపుల్ ఆర్ వచ్చి 2 మంత్స్ దాటిపోయింది. సర్కార్ వారి పాట వచ్చి వన్ మంత్ అయిపోయింది. ఇంకా ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు...............

Allu Arjun
NTR-Mahesh-Bunny : పుష్ప సినిమా వచ్చి సిక్స్ మంత్స్ క్రాస్ అయిపోయింది. ట్రిపుల్ ఆర్ వచ్చి 2 మంత్స్ దాటిపోయింది. సర్కార్ వారి పాట వచ్చి వన్ మంత్ అయిపోయింది. ఇంకా ఈ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు సెట్స్ మీదకెళ్తాయని ఫ్యాన్స్ లో ఆసక్తి, ఆత్రుత రోజు రోజుకీ పెరిగిపోతుంది. అందుకే తమ అభిమాన హీరో సినిమా అప్ డేట్ కోసం ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ పై ఒత్తిడి తెస్తున్నారు తారక్, బన్నీ, మహేశ్ ఫ్యాన్స్.
సర్కార్ వారి పాట రిలీజ్ అయిపోయాక మహేశ్ బాబు వెంటనే త్రివిక్రమ్ కాంబినేషన్ లో సెట్స్ మీదకెళ్తారనుకున్నారు ఫ్యాన్స్. ఎప్పుడో ముహూర్తం షాట్ అయిపోయింది, క్యాస్టింగ్ ఫిక్సయింది అయినా సెట్స్ మీదకెళ్లడానికి ఢిలే చేస్తున్నారు. దాంతో ఫ్యాన్స్ ఇంకా వెయిటింగ్ చేయలేక ట్విట్టర్ వేదికగా అప్ డేట్స్ చెప్పాలని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ నాగవంశీని అడిగేశారు. ఇది 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న సినిమా, భారీ అంచనాలుంటాయి తప్పకుండా అందరి అంచనాలకు మించి గుర్తుండి పోయే సినిమాగా రూపొందించాలంటే కొంత సమయం పడుతుంది. మీ క్యూరియాసిటీ అర్థమైంది కాని, కాస్త వెయిట్ చేయండి అని మహేశ్ ఫ్యాన్స్ కి రిప్లయ్ ఇచ్చి కొంత కూల్ చేశారు ప్రొడ్యూసర్ నాగవంశీ. మహేష్ ఇటీవలే ఫారెన్ నుంచి వచ్చారు. ఇంకా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. మరి త్రివిక్రమ్-మహేష్ సినిమా ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి.
లాస్ట్ ఇయర్ డిసెంబర్ 17న రిలీజ్ అయిన పుష్ప పాన్ ఇండియా రేసులో దూసుకెళ్లింది. నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. బ్లాక్ బస్టర్ క్లాసిక్ మూవీస్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణిని సైతం ఎంతగానో ఆకట్టుకుంది పుష్ప. ఆయనే స్వయంగా సుకుమార్ టీమ్ ను ప్రశంసించడం విశేషం. ఎప్పటి నుంచో పుష్ప 2 కోసం ఫ్యాన్స్, పాన్ ఇండియా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సుకుమార్ నుంచి ఎలాంటి అప్ డేట్ రాలేదు. కాని, రీసెంట్ గా బన్నీ వాస్ ఇచ్చిన అప్ డేట్ కొంత ఫ్యాన్స్ కి ఉపశపమనం కలిగించింది. జులై లాస్ట్ వీక్ నుంచి పుష్ప2 సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అయ్యిందని ఇటీవల చెప్పేశారు బన్నీ వాస్. పుష్ప వచ్చి ఆరు నెలలైనా ఇంకా పుష్ప 2 మొదలుపెట్టకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా మొదలుపెడతారో లేదో చూడాలి.
Movies : పాన్ ఇండియా సినిమాలు.. ఒత్తిడిలో దర్శకులు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో రానున్న ఎన్టీఆర్ 30 ఎప్పుడో పట్టాలెక్కుతుంది అనుకున్నారంతా. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అవగానే తారక్ ఫుల్ బిజీ షెడ్యూల్స్ లో ఉంటారనుకుంటే, దాదాపు రెండు నెలలు రిలాక్స్ మోడ్ లోకే వెళ్లారు తారక్. జులై లేదా ఆగస్టులో ఈ సినిమా సెట్స్ మీదకెళ్తుందని వార్తాలొస్తుండటంతో ఇంకో నెల రోజులకి పైగానే ఎన్టీఆర్ ఖాలీగా ఉండబోతున్నారా అంటూ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఇంకా కొరటాల టీమ్ మాత్రం తారక్ ను పాన్ ఇండియా రేంజ్ లో పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో ప్రజెంట్ చేయడం కోసం తెగ కష్ట పడుతున్నట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సక్సెస్ తర్వాత వీళ్ల కాంబోలో వస్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలని ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.