చిరంజీవి, రామ్‌చరణ్‌ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ప్రెషర్‌ కుక్కర్‌ను తీసుకెళ్తారు.. ఎందుకో చెప్పేసిన ఉపాసన

కుక్కర్‌ను వెంట పెట్టుకుని తీసుకెళ్లే అలవాటు రామ్‌చరణ్‌తో మొదలైంది కాదు.

రామ్‌చరణ్ గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగినప్పటికీ.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఓ అలవాటును మాత్రం కొనసాగిస్తున్నాడు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాసరే ప్రతిరోజు కనీసం ఒక్క పూటయినా భారతీయ భోజనం చేస్తున్నాడు. ఈ విషయాన్ని అతడి భార్య ఉపాసన తెలిపింది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పింది.

“ప్రపంచంలో ఏ చోట ఉన్నా నా భర్త కనీసం రోజుకి ఒక్క పూటయినా భారతీయ భోజనం చేస్తాడు. మంచి రెస్టారెంట్లలో తినాలని, అటువంటి వాటి కోసం మేం వెతుకుతాం. కానీ, రామ్ చరణ్ ఇష్టపడే కొన్ని ఫేవరెట్‌ ఫుడ్స్‌ ఉన్నాయి.

Also Read: హీరోయిన్ జాన్వీకి ఖరీదైన గిఫ్ట్.. ఎన్ని కోట్ల రూపాయలో, ఎవరిచ్చారో తెలుసా?

దీంతో, అతడు ఇష్టపడే ఫుడ్‌ను మా అత్తమ్మ రెడీ మిక్సెస్‌గా చేస్తుంది. మేము ఎక్కడికి వెళ్లినా కుక్కర్‌ తీసుకెళ్తాం. అయితే, కుక్కర్ వేడి, పొగకు ఫైర్‌ అలారం మోగకుండా హోటల్‌లోని బాత్రూంలో కుక్కర్‌ను పెట్టి వండుతాం. మేము ఎక్కడికెళ్లినా ఇంటి భోజనం ఇలా తింటాం” అని ఉపాసన తెలిపింది.

చాలా మందికి ఇంటి భోజనం అవసరం అవుతుందని, రోజుల తరబడి బయటి ఫుడ్ తినలేరని చెప్పింది. తన అత్తమ్మ సురేఖ ఇంట్లో రెడీ మిక్సెస్‌ చేస్తారని, అవి ఎక్కువ కాలం నిల్వ ఉండవని, త్వరగా వాడుకుంటారు కాబట్టి ఫ్రెష్‌గా ఉంటాయని తెలిపింది.

చిరంజీవి, చెర్రీ కోసం సురేఖ చాలా కాలంగా ఇలాగే రెడీ మిక్సెస్‌ తయారు చేస్తుంది. వారి ఎక్కడికి వెళ్లినా వాటిని ఇస్తుంది. దీంతో వాటిని చిరు, చెర్రీ తీసుకెళ్లి కుక్కర్‌లో వండుకుని తింటారు. ఇప్పుడు “అత్తమ్మ కిచెన్” పేరిట మెగా ఫ్యామిలీ రెడీ మిక్సెస్‌ను ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తోంది.

కుక్కర్‌ను వెంట పెట్టుకుని తీసుకెళ్లే అలవాటు రామ్‌చరణ్‌తో మొదలైంది కాదు. మెగాస్టార్ చిరంజీవి కూడా విదేశాలకు వెళ్లినప్పుడు ఇదే చేస్తారు. మొదట చిరంజీవి కోసమే సురేఖ రెడీ మిక్సెస్‌ తయారు చేసేవారు. ఇప్పుడు తన కుమారుడు చెర్రీ కోసం కూడా అదే పనిచేస్తున్నారు.