Puneeth Wife : పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య

పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ ఇక లేరన్న వార్త విని 12 మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

Puneeth Wife

Puneeth Wife : పునీత్ రాజ్‌కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పునీత్ ఇక లేరన్న వార్త విని 12 మంది అభిమానులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మరికొందరు గుండెపోటుతో మరణించారు. ఇలా వరుసగా ఆత్మహత్య చేసుకుంటుండటంపై పునీత్ భార్య అశ్విని స్పందించారు.

చదవండి : Puneeth Rajkumar : పునీత్ మరణాన్ని బిజినెస్ చేసుకుంటున్న హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్.. ఆగ్రహంలో ఫ్యాన్స్

పునీత్ మరణం తమ కుటుంబంలో తీరని లోటని అలాంటి పరిస్థితి మీ కుటుంబానికి రాకూడదని కోరారు. అప్పు లేరన్న విషయాన్నీ తాము కూడా జీర్ణించుకోలేకపోతున్నామని అశ్విని తెలిపారు.ఇలాంటి సమయంలో మీరు చూపిస్తున్న ఎనలేని ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన మన మధ్య లేకపోయినా మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడి మీ కుటుంబాన్ని ఒంటరి చేయొద్దు’ అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి : Puneeth Rajkumar : ‘నువ్వు మనిషి రూపంలో ఉన్న దేవుడివయ్యా’..

ఇక అప్పుకు నివాళి అర్పించేందుకు కంఠీరవ స్టూడియోకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు అభిమానులు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు అప్పు కుటుంబసభ్యులను పరామర్శించి వారికి దైర్యం చెబుతున్నారు. సామాజిక సేవలో ముందుండే అప్పును కోల్పోవడం తమకు తీరని లోటని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.