Puneeth Rajkumar : పునీత్ మరణాన్ని బిజినెస్ చేసుకుంటున్న హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్.. ఆగ్రహంలో ఫ్యాన్స్ | Hospitals doing business with Puneet's death

Puneeth Rajkumar : పునీత్ మరణాన్ని బిజినెస్ చేసుకుంటున్న హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్.. ఆగ్రహంలో ఫ్యాన్స్

 కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు దేన్నైనా వాళ్ళ బిజినెస్ కి అనుకూలంగా మార్చేసుకోగలరు. ఒకరి మరణాన్ని కూడా బిజినెస్ చేసుకునే మనుషులు ఈ సమాజంలో ఉన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్

Puneeth Rajkumar : పునీత్ మరణాన్ని బిజినెస్ చేసుకుంటున్న హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్.. ఆగ్రహంలో ఫ్యాన్స్

Puneeth Rajkumar :  కొంతమంది బిజినెస్ చేసేవాళ్ళు దేన్నైనా వాళ్ళ బిజినెస్ కి అనుకూలంగా మార్చేసుకోగలరు. ఒకరి మరణాన్ని కూడా బిజినెస్ చేసుకునే మనుషులు ఈ సమాజంలో ఉన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. అభిమానులు, కర్ణాటక ప్రజలు, కుటుంబ సభ్యులు ఆయన మరణాన్ని నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆయన మరణించారు అనే శోకంలోనుంచి బయటకి రాకముందే కొన్ని హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ చేసే పని వారికి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది.

Suma : ‘జయమ్మ పంచాయితీ’లో సుమక్క.. 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సుమ

పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో అనుకోకుండా సడెన్ గా మరణించారు. ఎలాంటి చెడు అలవాట్లు లేకుండా, రోజూ హెల్తీ ఫుడ్ తింటూ, రోజూ వ్యాయామం చేసే పునీత్ సడెన్ గా గుండెపోటుతో ఎలా మరణించారో ఎవ్వరికి అంతు చిక్కట్లేదు. పునీత్ రాజ్‌కుమార్ చ‌నిపోయిన విధానం చూస్తే కొంతమంది సామాన్యులకి భయం పట్టుకుంది. ఫిట్‌గా ఉన్న వ్య‌క్తి ఇలా సడెన్ గా మరణించాడేంటి అని ఆలోచిస్తున్నారు. ఈ భ‌యాన్ని కొంద‌రు క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Skylab : స్కైలాబ్.. రియల్ స్టోరీకి కామెడీ టచ్ తో రాబోతున్న సత్యదేవ్

కర్ణాటకలోని కొన్ని హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్స్ పునీత్ మరణాన్ని ఉదాహరణగా చూపిస్తూ ఎవరు ఎప్పుడూ ఎలా చనిపోతారో ఎవరికీ తెలీదు. పునీత్ లాంటి వ్యక్తే సడెన్ గా గుండెపోటుతో చనిపోయారు. అందుకే మీరు హెల్త్ చెకప్స్ చేయించుకోండి, గుండె పరీక్షలు చేయించుకోండి అంటూ ప్రమోషన్స్ చేస్తున్నాయి. ఇందులో ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయి. బెంగుళూరులోని ఓ డ‌యాగ్న‌స్టిక్స్ సంస్థ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో మ‌ర‌ణించ‌డంపై సంతాపాన్ని తెలియ‌జేస్తూ ఉన్న ఓ బ్యానర్ పెట్టి దాని పైనే ఉద‌యం 7 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు ఉచితంగా అంద‌రికీ గుండె, ఇత‌ర చెకప్స్‌ను చేస్తామ‌ని ప్ర‌క‌టించి, దాని కిందే మా వ‌ద్ద‌కు మీరు బీపీ. ఈసీజీ, క్రెటిన్ లైన్‌, కొల‌స్ట్రాల్ చెకప్స్ చేయించుకుంటే కేవ‌లం మూడు వంద‌ల రూపాయ‌లు మాత్ర‌మే చెల్లిస్తే చాలని యాడ్ పోస్ట్ చేసింది.

Jai Bheem : ‘జై భీమ్‌’లో సినతల్లి పాత్రలో ఒదిగిపోయిన నటి ఎవరో తెలుసా?

దీంతో పునీత్ మరణాన్ని క్యాష్ చేసుకోవాలని చాలా మంది చూస్తున్నారని అభిమానులు ఇలాంటి వాటిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడితో పోల్చే వ్యక్తిని ఇలా ఉపయోగించుకోవటం సరి కాదు అని అంటున్నారు. ఇలాంటి హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

×