Suma : ‘జయమ్మ పంచాయితీ’లో సుమక్క.. 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సుమ

గతంలో 1996లో 'కళ్యాణ ప్రాప్తిరస్తు' అనే ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది సుమ. మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ గా సుమ సినిమా రాబోతుంది. సుమకి ఇండస్ట్రీలో అందరితో మంచి

Suma : ‘జయమ్మ పంచాయితీ’లో సుమక్క.. 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ లో సుమ

Sumakka

Suma :  బుల్లితెర రారాణిగా ఓ వెలుగు వెలుగుతుంది యాంకర్ సుమ క‌న‌కాల. పరిశ్రమకి వచ్చి చాలా సంవత్సరాలైనా ఇప్ప‌టికీ స్టార్ యాంక‌ర్‌గానే కొన‌సాగుతుంది. కేరళలో పుట్టిపెరిగిన ఈ మలయాళీ భామ తెలుగుపై పట్టు సాధించి తెలుగులో తిరుగులేని యాంకర్ గా ఎదిగింది. బుల్లితెరపై సుమకి తిరుగులేదు. ఇప్పుడొచ్చే యాంకర్స్ అంతా టీవీలోనే కాక సినిమాల్లోనూ కనపడటానికి ట్రై చేస్తున్నారు. సుమ ఎప్పుడూ సినిమాల్లో కనపడటానికి ట్రై చేయలేదు. అప్పుడప్పుడు ఎవరైనా చిన్న చిన్న పాత్రలు చేయమని రిక్వెస్ట్ చేస్తే కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. వర్షం, ఢీ, బాద్ షా, ఓ బేబీ చిత్రాలలో సుమ చిన్న చిన్న పాత్రలు చేశారు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయి పాత్రలో అది కూడా సుమ మెయిన్ లీడ్ తో సినిమా రాబోతుంది.

Shyam Singha Roy : ఎగసి ఎగసి పడే అలజడి వాడే.. ‘శ్యామ్ సింగరాయ్’ .. మాస్ లుక్ లో రాబోతున్న న్యాచురల్ స్టార్

ఇన్నాళ్లు నన్ను బుల్లితెర మీద ఆదరించినందుకు, మీ సపోర్ట్‌కు థ్యాంక్స్.. దేవుడి దయతో ఫీచర్ ఫిల్మ్ ఎంట్రీ ఇస్తున్నాను అంటూ నిన్న ఓ పోస్టర్ షేర్ చేశారు సుమ. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్లో సుమ మెయిన్ లీడ్ గా విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఇవాళ ఉద‌యం రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫ‌స్ట్ లుక్‌ మోష‌న్ పోస్ట‌ర్ కూడా రిలీజ్ చేశారు. ‘జయమ్మ పంచాయితీ’ అనే టైటిల్ తో ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ చూస్తే ఒక పల్లెటూళ్ళో ఊరి పెద్దగా సుమ ఉండబోతుందని తెలుస్తుంది.

Skylab : స్కైలాబ్.. రియల్ స్టోరీకి కామెడీ టచ్ తో రాబోతున్న సత్యదేవ్

గతంలో 1996లో ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ అనే ఓ సినిమాలో హీరోయిన్ గా చేసింది సుమ. మళ్ళీ దాదాపు 25 సంవత్సరాల తర్వాత మెయిన్ లీడ్ గా సుమ సినిమా రాబోతుంది. సుమకి ఇండస్ట్రీలో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి.కచ్చితంగా ఈ సినిమాకి ఇండస్ట్రీ స్టార్లంతా ప్రమోషన్ చేస్తారని తెలుస్తుంది. సుమ అభిమానులతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని మహిళలంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.