Tamil Movies : తమిళ్ వాళ్లకు వెయ్యి కోట్లు కలేనా? లోకేష్ – రజిని కాంబో కూడా కష్టమే? ఇంతమంది స్టార్స్ ని పెట్టినా?

తమిళ్ నుంచి ఏ భారీ సినిమా వచ్చినా, పెద్ద హీరో సినిమా వచ్చినా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అని అంచనాలు వేసుకుంటున్నారు.

Tamil Movies

Coolie : ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలు అన్ని మా సినిమాలకు ఇన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అని గర్వంగా చెప్పుకుంటున్నాయి. ఇప్పుడు అన్ని పరిశ్రమలకు వెయ్యి కోట్లే టార్గెట్. ఏ పెద్ద సినిమా వచ్చినా, పాన్ ఇండియా సినిమా వచ్చినా వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందా అనే చర్చే జరుగుతుంది. బాలీవుడ్ వాళ్లకు వెయ్యి కోట్ల సినిమాలు ఉన్నాయి. మన టాలీవుడ్ లో బాహుబలి, పుష్ప, RRR, కల్కి.. సినిమాలతో వెయ్యి కోట్లు సాధించారు. కన్నడలో కెజిఎఫ్ సినిమా వేయి కోట్లు సాధించింది.

కేరళ మలయాళం సినిమా వాళ్ళు అసలు కలెక్షన్స్ గురించే మాట్లాడారు. వాళ్ళు ఈ వెయ్యి కోట్లు పట్టించుకోవట్లేదు. కానీ తమిళ్ ప్రేక్షకులు, సినిమా పరిశ్రమ వాళ్ళు మాత్రం వెయ్యి కోట్ల కలెక్షన్స్ కోసం కలలు కంటున్నారు. తమిళ్ నుంచి ఏ భారీ సినిమా వచ్చినా, పెద్ద హీరో సినిమా వచ్చినా వెయ్యి కోట్ల కలెక్షన్స్ అని అంచనాలు వేసుకుంటున్నారు.

Also Read : NTR : ఎన్టీఆర్ సోలోగా బాలీవుడ్ లో YRF స్పై యూనివర్స్ సినిమా ఫిక్స్..? వార్ 2లో హింట్.. టైటిల్ ఇదే?

గతంలో పొన్నియన్ సెల్వన్ రెండు పార్టులు, జైలర్, లియో.. ఇలా పలు సినిమాలకు వెయ్యి కోట్లు వస్తాయని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మళ్ళీ కూలీ సినిమాకు కూడా వెయ్యి కోట్లు వస్తాయని చాలా ఆశలు పెట్టుకున్నారు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ సినిమా కావడం, రజినీకాంత్ హీరో అవ్వడం, రజినీకాంత్ 50 ఏళ్ళు పూర్తవడం, నాగార్జున మొదటి సారి విలన్ గా చేస్తుండటం, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్.. లాంటి స్టార్స్ ఉండటం, పాన్ ఇండియా రిలీజ్ చేయడం.. ఇలా అన్ని అంశాలతో ఈ సినిమాకు బాగా హైప్ వచ్చింది.

వేరే స్టార్ హీరోలను పెట్టుకొని వెయ్యి కోట్లు కొందామని ప్లాన్ చేసినా వర్కౌట్ అయ్యేలా రాలేదు. దీంతో ఈ సినిమాకు అయినా వెయ్యి కోట్లు వస్తాయని తమిళ్ ప్రేక్షకులు, సినీ పరిశ్రమ ఊహించింది. పలువురు ఈ సినిమాతో వెయ్యి కోట్లు కొడతామని కామెంట్స్ కూడా చేసారు. తమిళ మీడియా కూడా ఈ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తుందని రాసారు. తీరా సినిమా చూసాకా ఇది యావరేజ్ అంటున్నారు. తెలుగులో అయితే ఈ సినిమాకు సరైన స్పందన రావట్లేదు. తమిళ్ తప్ప మిగతా భాషల్లో కూడా సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. దీంతో ఈ సినిమాతో కూడా తమిళ్ వాళ్లకు వెయ్యి కోట్లు కష్టమేనా అని అనిపిస్తుంది.

Also Read : Coolie : రజినీకాంత్ – నాగార్జున ‘కూలీ’ మూవీ రివ్యూ.. నాగార్జున విలన్ గా చేసిన సినిమా..

కాకపోతే నాలుగు రోజులు సెలవులు ఉండటం, రజినీకాంత్ సినిమా కావడం, తమిళ్ లో ఇప్పుడు ఇంకే సినిమా లేకపోవడంతో కూలీ ఒక 600 కోట్ల వరకు అయితే కలెక్ట్ చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. బాక్సాఫీస్ సమాచారం ప్రకారం కూలీ సినిమా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 710 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. కూలీకి వచ్చిన హైప్ తో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లు సాధించింది. మరి కూలీ సినిమా మొత్తంగా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి. మొత్తానికి తమిళ్ వాళ్లకు వెయ్యి కోట్లు కలేనా? ఎప్పటికి తీరుతుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.