will Jani Master do Choreography in Allu Arjun Pushpa 2 Movie Producers gives Clarity
Jani Master – Allu Arjun : నేడు పుష్ప 2 నిర్మాతలు ఈ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహించారు. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఒక రోజు ముందుకు మార్చి డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్ లో పుష్ప 2 గురించి, అల్లు అర్జున్ గురించి అనేక అంశాలు మాట్లాడారు నిర్మాతలు.
అయితే ఇటీవల జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు చేసాడని ఆరోపణలు చేసింది. దీంతో జానీ మాస్టర్ జైలుపాలయ్యారు. ఈ ఘటన జరిగే ముందే పుష్ప 2 సినిమాలో ఐటెం సాంగ్ కి కొరియోగ్రాఫర్ గా జానీ మాస్టర్ ని తీసుకున్నారు. జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో పుష్ప 2లో ఆ సాంగ్ ఎవరు కంపోజ్ చేస్తారు అని చర్చగా మారింది. అయితే ఇవాళే పుష్ప 2 ప్రెస్ మీట్ పెట్టడం, ఇవాళే జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో దీనిపై మీడియా ప్రశ్నించారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు.. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే..
జానీ మాస్టర్ కి బెయిల్ రావడంతో పుష్ప 2లో సాంగ్ ఆయనే కంపోజ్ చేస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా నిర్మాత సమాధానమిస్తూ.. ఆల్రెడీ కొరియోగ్రాఫర్ మార్చేసాము. వేరే కొరియోగ్రాఫర్ తో సాంగ్ షూట్ చేయిస్తున్నాము అని తెలిపారు. ఆ ఐటెం సాంగ్ నవంబర్ 4 నుంచి షూట్ చేయబోతున్నట్టు కూడా తెలిపారు. దీంతో జానీ మాస్టర్ కి పుష్ప 2 ఛాన్స్ మొత్తానికే పోయినట్టే.