Allu Arjun : అల్లు అర్జున్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు.. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే..

ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఓ వైసీపీ నేతకు సపోర్ట్ గా ప్రచారం చేయడంతో జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ బాగా హర్ట్ అయి అల్లు అర్జున్ ని విమర్శించారు.

Allu Arjun : అల్లు అర్జున్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు.. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కటే..

Pushpa 2 Producers gives Clarity on Allu Arjun Political Issue

Updated On : October 24, 2024 / 3:25 PM IST

Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించి నిర్మాతలు నేడు ఓ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో డిసెంబర్ 5నే ఈ సినిమా రిలీజ్ కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక పుష్ప 2 గురించి, అల్లు అర్జున్ గురించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

అయితే ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ఓ వైసీపీ నేతకు సపోర్ట్ గా ప్రచారం చేయడంతో జనసేన కార్యకర్తలు, ఫ్యాన్స్ బాగా హర్ట్ అయి అల్లు అర్జున్ ని విమర్శించారు. ఇక మెగా ఫ్యాన్స్ కూడా విమర్శలు చేసారు. దీంతో మెగా ఫ్యాన్స్ కి – అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి విబేధాలు వచ్చాయి. అలాగే ఆ రెండు ఫ్యామిలీలకు విబేధాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. నేడు పుష్ప 2 ప్రెస్ మీట్ లో దీని గురించి ప్రశ్నించారు.

Also Read : Pushpa 2 : పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూటింగ్ డేట్ ఫిక్స్!.. అప్పుడు స‌మంత‌, ఇప్పుడు ఎవ‌రు?

దీంతో నిర్మాతలు నవీన్, రవి శంకర్ మాట్లాడుతూ.. మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కరే. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ పుష్ప 2 సినిమా చూడాలి అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఏదైనా చిన్న చిన్నవి వచ్చి ఉండొచ్చు అంతేకాని సినిమా పరంగా అందరూ ఒకటే. ఆయన పొలిటికల్ గా డివైడ్ అవ్వలేదు. అసలు అల్లు అర్జున్ కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. ఫ్యాన్స్ కు, హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దు అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యాలు వైరల్ గా మారాయి. మరి దీనిపై మెగా ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో చూడాలి.