Pushpa 2 : పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూటింగ్ డేట్ ఫిక్స్!.. అప్పుడు స‌మంత‌, ఇప్పుడు ఎవ‌రు?

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2.

Pushpa 2 : పుష్ప 2 ఐటమ్ సాంగ్ షూటింగ్ డేట్ ఫిక్స్!.. అప్పుడు స‌మంత‌, ఇప్పుడు ఎవ‌రు?

Pushpa 2 movie Item song shooting may be november first week

Updated On : October 24, 2024 / 3:03 PM IST

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న మూవీ పుష్ప 2. ఈ చిత్రం ఒక రోజు ముందుగా అంటే.. డిసెంబ‌ర్ 5న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ విష‌యాన్ని ఓ కొత్త పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్ స్పెష‌ల్ ప్రెస్‌మీట్‌ను పెట్టి పుష్ప 2 గురించి ప‌లు విష‌యాల‌ను వెల్ల‌డించారు.

పుష్ప 1 చిత్రంలో స్పెష‌ల్ సాంగ్‌లో స‌మంత అద‌ర‌గొట్టిన సంగ‌తి తెలిసిందే. ఇక పుష్ప 2లో సైతం ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంద‌ని, అది తొలి పార్టు మించి ఉంటుంద‌నే అంటున్నారు. ఈ పాట‌లో  స్టార్ హీరోయిన్ డ్యాన్స్ చేయ‌నున్న‌ట్లు ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చల్ చేస్తున్నాయి.  దీనిపై నిర్మాత‌లు స్పందించారు.

Pushpa 3 : అల్లు అర్జున్ పుష్ప 3 పై నిర్మాత క్లారిటీ.. ఉన్నట్టేనా..?

ఈ స్పెష‌ల్ సాంగ్‌ను నవంబ‌ర్ 4 నుంచి షూట్ చేయాల‌ని అనుకుంటున్న‌ట్లుగా చెప్పారు. ఈ స్పెష‌ల్ సాంగ్‌లో చేసేదెవ‌రో ఇంకా ఫిక్స్ కాలేద‌ని తెలిపారు. దీంతో ఈ సాంగ్‌ను ఎవ‌రు చేయ‌నున్నారు అనేది అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది.