Pushpa 3 : అల్లు అర్జున్ పుష్ప 3 పై నిర్మాత క్లారిటీ.. ఉన్నట్టేనా..?
నేడు పుష్ప 3 గురించి ప్రశ్నించగా నిర్మాత సమాధానమిచ్చారు.

Producer Ravi Shankar gives Clarity on Allu Arjun Pushpa 3 Movie
Pushpa 3 : అల్లు అర్జున్ పుష్ప సినిమా నేషనల్ వైడ్ హిట్ అయి నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా సాధించడంతో పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నేడు పుష్ప 2 మూవీ ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ 5 న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈ ప్రెస్ మీట్ లో పుష్ప 2 గురించి పలు అంశాలు తెలిపారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో గతంలో పుష్ప 3 కూడా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప 3కి స్కోప్ ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో నేడు పుష్ప 3 గురించి ప్రశ్నించగా నిర్మాత సమాధానమిచ్చారు.
నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది కాబట్టే పార్ట్ 2 తీసాము. అలాగే ఈ సినిమా కూడా హిట్ అయితే పుష్ప 3 గురించి ఆలోచిస్తాము. సినిమా చివర్లో మాత్రం పుష్ప 3 కథకు లీడ్ అయితే ఉంటుంది అని చెప్పారు . దీంతో పుష్ప 3 కూడా ఉంటుందని క్లారిటీ వచ్చేసినట్టే అంటున్నారు. మరి పుష్ప 3 వెంటనే వస్తుందా లేక అల్లు అర్జున్, సుకుమార్ వేరే సినిమాలు చేసొచ్చి మళ్ళీ పుష్ప 3 మొదలుపెడతారా చూడాలి.