Rajamouli: ఆర్ఆర్ఆర్-2 నిజంగానే ఉంటుందా? పబ్లిసిటీ ఎత్తుగడేనా?

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు భారీ..

Rrr Team Tweet On Worldwide Collections

Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, చెర్రీలతో భారీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది. మొదటి రోజు భారీ కలెక్షన్లని సాధించి దూసుకుపోతుంది. సినిమా చూసిన వారంతా రాజమౌళి, చరణ్, తారక్ లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ఎవరి స్థాయిలో వాళ్ళు ఇరగదీశారని చెప్పకనే చెప్పేస్తున్నారు. కథలో చిన్న చిన్న తప్పులు చెప్పిన విశ్లేషకులు సైతం.. రాజమౌళితో పాటు ఇద్దరు హీరోల కష్టానికి వంకలు పెట్టడం లేదు.

Mahesh-Rajamouli: టాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా జక్కన్న-మహేష్ ప్రాజెక్ట్?

ఇక, ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి రెండు వారాలు అవుతున్నా కలెక్షన్ల వరద మాత్రం ఆగడం లేదు. బాక్సాఫీస్ వద్ద మరే ఇతర పెద్ద సినిమా లేకపోవడం.. రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి జనం బ్రహ్మరథం పడుతుండటంతో.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అయితే.. ఈ సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారి ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి, కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ ఆలోచన ఉందని కూడా చెప్పారు.

Rajamouli: రాజమౌళికి దాసోహమంటున్న నాన్ స్టాప్ హిట్స్.. రీజనేంటి?

అయితే.. ఆర్ఆర్ఆర్ 2 నిజంగానే ఉంటుందా?.. లేక ఇప్పుడు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే జక్కన్న అండ్ కో అభిమానులను ఉత్సాహపరిచేందుకే చెప్తున్నారా అన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ముగియగానే మహేష్ అడ్వెంచరస్ మూవీకి సిద్ధమవ్వాలి. ఎలా తీసినా ఆ సినిమా మూడేళ్లు పట్టడం ఖాయం. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కానీ.. జక్కన్న డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కానీ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే మరో మూడు నాలుగేళ్లు సమయం అక్కడే పోతుంది.

Rajamouli: నేనే నంబర్ వన్ అంటున్న జక్కన్న.. సక్సెస్ సీక్రెట్ ఏంటి?

ఇక, ఆర్ఆర్ఆర్ విషయానికి వస్తే.. మల్టీస్టారర్ క్రేజ్.. రాజమౌళి మార్కెటింగ్ కలిసి సినిమాకి భారీ కలెక్షన్లు వస్తున్నాయి కానీ.. సినిమాలో జక్కన్న మార్క్ ఇంకా కనిపించాల్సి ఉందనే నెగటివ్ ఫీడ్ బ్యాక్ కూడా వినిపించింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా సీక్వెల్ కి రాజమౌళి పూనుకుంటాడా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. విజయేంద్రప్రసాద్ కథను ఎలాగైనా పట్టుకొచ్చినా తెచ్చి పెట్టిన కథ జక్కన్నకు నచ్చుతుందా.. ఒకవేళ నచ్చినా అది కార్యరూపం దాల్చేందుకు ఎన్నేళ్లు పడుతుంది అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికైతే ఆర్ఆర్ఆర్-2 మాట కేవలం పబ్లిసిటీలో భాగంగానే కనిపిస్తుంది.