Rajamouli: రాజమౌళికి దాసోహమంటున్న నాన్ స్టాప్ హిట్స్.. రీజనేంటి?

రొమాన్స్ లేదు.. కామెడీ లేదు.. ఫార్ములా మేకింగ్ అంతకన్నా లేదు.. కానీ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్.. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ట్రిపుల్ మినిమం 3 వేల కోట్లు గ్యారంటీ..

Rajamouli: రాజమౌళికి దాసోహమంటున్న నాన్ స్టాప్ హిట్స్.. రీజనేంటి?

Rajamouli (1)

Rajamouli: రొమాన్స్ లేదు.. కామెడీ లేదు.. ఫార్ములా మేకింగ్ అంతకన్నా లేదు.. కానీ బొమ్మ మాత్రం బ్లాక్ బస్టర్.. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ట్రిపుల్ మినిమం 3 వేల కోట్లు గ్యారంటీ అంటున్నారు జనాలు. వరల్డ్ వైడ్ రికార్డ్ థియేటర్లలో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ మూవీ యునానిమస్ రివ్యూ అందుకుని అన్నిచోట్లా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంటోంది. ఈ నాన్ స్టాప్ హిట్స్ రాజమౌళి సొంతమవడానికి కారణమేంటి..?

Rajamouli: నేనే నంబర్ వన్ అంటున్న జక్కన్న.. సక్సెస్ సీక్రెట్ ఏంటి?

ఎస్‌ఎస్‌ రాజమౌళి అంటే సూపర్ సక్సెస్‌ రాజమౌళి అని పిలుచుకుంటారు ఆయన ఫ్యాన్స్. సినిమా తీస్తే అది సూపర్ డూపర్ హిట్టు కావాల్సిందే. ఇంత వరకు ఫెయిల్యూర్‌ అనేదే లేని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకెళుతొంది. ఫస్ట్ డే 200 కోట్ల కలెక్షన్లు టార్గెట్ గా పెట్టుకున్న రాజమౌళి ట్రిపుల్ఆర్ మూవీ ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొట్టడానికి సై అంటోంది.

Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

ట్రిపుల్ ఆర్ మేనియా ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది. ట్రిపుల్ ఆర్ సక్సెస్ తో పాటు ఈ మల్టీస్టారర్ మూవీ ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుందనే అందరూ ఎదురుచూస్తున్నారు. రాజమౌళి రికార్డులకు కేరాఫ్ అడ్రస్. అందుకే ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా మూవీగా తీసిన బాహుబలి నెవర్ బిఫోర్ రికార్డ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. రాజమౌళి సిల్వర్ స్క్రీన్ మీద ప్రస్తుతం ఓ బ్రాండ్. తన సినిమాల రికార్డ్ లను తానే బ్రేక్ చేసుకుంటూ వస్తున్న ట్రిపుల్ ఆర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

Rajamouli: జక్కన్న క్రేజీ థాట్.. రజనీ-కమల్ తో మల్టీస్టారర్ సినిమా!

ట్రిపుల్ ఆర్ కంటే ముందు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా 250 కోట్ల రూపాయల బడ్జెట్ తో వచ్చి, ఇండియన్‌ సినీ పరిశ్రమ కనీ వినీ ఎరుగని స్థాయిలో 1810 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ 500 కోట్ల బడ్జెట్ తో వచ్చింది కాబట్టి మినిమం 3 వేల గ్యారంటీగా కలెక్ట్ చేస్తుందంటున్నారు ఫాన్స్. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా సంచలనాలు నమోదు చేస్తున్న దర్శకుడు రాజమౌళి. హీరోయిజాన్ని పీక్స్ లో చూపించే జక్కన్న తను చేసిన 11 సినిమాలతో తన హీరోలకు మెమరబుల్ హిట్స్ అందించాడు.

Rajamouli : హీరోలని డామినేట్ చేసిన రాజమౌళి.. థియేటర్ వద్ద భారీ కటౌట్..

‌ఇప్పుడే కాదు.. ఫస్ట్ సినిమా నుంచే రాజమౌళి సక్సెస్ వెంటే ఉన్నారు. రాజమౌళి ప్రతి సినిమా హిట్ అవ్వడానికి కారణం ఎమోషన్. ఆడియన్స్ ని కనెక్ట్ చేసే ఎమోషన్ తో సినిమాల్ని సూపర్ హిట్ చేస్తున్నారు జక్కన్న. రాజమౌళి.. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారాడు.

Rajamouli : అల్లూరి క్యారెక్టర్‌కి చెర్రీని, కొమరం భీం క్యారెక్టర్‌కి తారక్‌నే ఎందుకు తీసుకున్నానంటే…

స్టూడెంట్ నంబర్ 1 సినిమాను సూపర్ హిట్ గా నిలబెట్టిన జక్కన్న హీరోగా ఎన్టీఆర్ కు తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టాడు. ఆ తర్వాత మరింత భారీ హీరోయిజంతో ఎన్టీఆర్ ను సింహాద్రి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. భారీ యాక్షన్ సీన్లతో పాటు మాస్ మాసాలా యాక్షన్ డ్రామాతో సింహాద్రి సినిమాను పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన రాజమౌళి, ఎన్టీఆర్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ ను అందించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ మాస్ ప్రేక్షకుల ఆరాధ్య దైవంగా మారిపోయాడు. జక్కన్న డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేసిన హ్యాట్రిక్ సినిమా యమదొంగ. ఎన్టీఆర్ ను యంగ్ యముడిగా చూపిన రాజమౌళి, మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ తో అలరించాడు.

Mahesh-Rajamouli: ఇంట్రెస్టింగ్ అప్డేట్.. అడ్వెంచర్ థ్రిల్లర్‌గా మహేష్-రాజమౌళి సినిమా?

అప్పటికే ఫ్లాప్ లతో సతమతమవుతున్న నితిన్ హీరోగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సై సినిమా చేసి స్టూడెంట్స్ ఎమోషన్స్ తో సినిమాను సూర్ హిట్ చేశారు రాజమౌళి. ఇక ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఛత్రపతి. అప్పటి వరకు ప్రభాస్ ను ఎవరూ చూపించనంత పవర్ ఫుల్ గా ఈ సినిమాలో చూపించిన రాజమౌళి.. ప్రభాస్ లోని మాస్ అపీల్ ను హీరోయిజాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాడు.

Rajamouli: దట్ ఈజ్ జక్కన్న.. దండాలు పెట్టేస్తున్న బాలీవుడ్!

జక్కన్న దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన సినిమా విక్రమార్కుడు. రవితేజ మార్క్ కామెడీ టైమింగ్ తో పాటు రాజమౌళి స్టైల్ టేకింగ్ తో ఆకట్టుకున్న ఈసినిమా రవితేజ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. అప్పటి వరకు కామెడీ ఇమేజ్ మాత్రమే ఉన్న రవితేజను సీరియస్ పోలీస్ ఆఫీసర్ గా హీరో రేంజ్ ను టాప్ కు తీసుకెళ్లాడు.

Rajamouli : ఈ సినిమా డైరెక్టర్ నాకంటే పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా : రాజమౌళి

రామచరణ్ హీరోగా రాజమౌళి మగధీర సినిమాను తెరకెక్కించాడు. 400 ఏళ్ల క్రితం ప్రేమను గెలిపించుకునేందుకు మళ్లీ పుట్టిన ప్రేమికుల కథతో తెరకెక్కిన ఈ సినిమాలో సంచలన విజయం సాధించింది. అంతేకాదు 50 కోట్ల మార్క్ ను దాటిన తొలి తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా విజయం చరణ్ ను ఒక్కసారిగా టాప్ స్టార్ గా మార్చేసింది. ఈగ సినిమాతో మేకింగ్ ని నెక్ట్స్ లెవల్ ని తీసుకెళ్లారు రాజమౌళి. ఎమోషన్ కి గ్రాఫిక్స్ యాడ్ చేసి నెవర్ బిఫోర్ మేకింగ్ తో సర్ ప్రైజ్ చేసి సూపర్ సక్సెస్ అందుకున్నారు జక్కన్న.

Mahesh-Rajamouli: క్రేజీ కాంబో కోసం విక్రమ్ డేట్స్.. ఇందులో నిజమెంత?

రాజమౌళి సినిమాలన్నింటిలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా వచ్చింది బాహుబలి. దాదాపు ఐదేళ్ల పాటు శ్రమించి రెండు పార్టులుగా బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు జక్కన్న. బాహుబలి సినిమా నేషనల్ లెవల్ పాత రికార్డ్ లను చేరిపేస్తూ సరికొత్త రికార్డ్ లను సెట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డుల్ని చెరిపేసి సరికొత్త ఇండస్ట్రీ రికార్డుల్ని సెట్ చెయ్యడానికి వచ్చింది ట్రిపుల్ఆర్. 500 కోట్ల బడ్జెట్ తో భారీ స్టార్ కాస్ట్ తో గ్రాండ్ మేకింగ్ తో తెరకెక్కి రిలీజ్ అయిన ప్రతి చోటా అల్టిమేట్ రెస్పాన్స్ సంపాదించుకుంటున్న ట్రిపుల్ఆఱ్.. ఇండియన్ సినిమాకి మైల్ స్టోన్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు అటు ఫాన్స్ తో పాటు సినిమా వర్గాలు.