Rajamouli: నేనే నంబర్ వన్ అంటున్న జక్కన్న.. సక్సెస్ సీక్రెట్ ఏంటి?

సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్లు, ఫ్లాపులు సహజం. కానీ హిట్ తప్ప ఫ్లాప్ అనే మాటకు తన డిక్షనరీ లో చోటే ఇవ్వని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. అదే బడ్జెట్ తో, అంతే భారీ స్టార్..

Rajamouli: నేనే నంబర్ వన్ అంటున్న జక్కన్న.. సక్సెస్ సీక్రెట్ ఏంటి?

Rajamouli

Rajamouli: సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా హిట్లు, ఫ్లాపులు సహజం. కానీ హిట్ తప్ప ఫ్లాప్ అనే మాటకు తన డిక్షనరీ లో చోటే ఇవ్వని వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. అదే బడ్జెట్ తో, అంతే భారీ స్టార్ కాస్ట్ తో అంతకంటే ఎక్కువ గ్రాండ్ గా తెరకెక్కించిన మిగతా సినిమాలు అడ్రస్ లేకుండా పోతుంటే.. రాజమౌళి మాత్రం నాన్ స్టాప్ సక్సెస్ తో నంబర్ వన్ పొజిషన్ దిగనంటున్నారు. ఇలా రాజమౌళి తీసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి సక్సెస్ సీక్రెట్ ఏంటి..?

Rajamouli: మహేష్ కోసం అడవి బాట పడుతున్న జక్కన్న..?

రాజమౌళి జస్ట్ డైరెక్టర్ కాదు. తెలుగు సినిమా బ్రాండ్.. తెలుగు సినిమాలకు ట్రెండ్ సెట్టర్. కెరీర్ లో చేసిన ప్రతి సినిమా హిట్. జస్ట్ హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్. లేటెస్ట్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ట్రిపుల్ఆర్ కూడా బాక్సాఫీస్ బద్దలయ్యే సక్సెస్ తో దూసుకుపోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ లీడ్ రోల్స్ లో రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో వరసగా పదకొండో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని అన్ స్టాపబుల్ ఇండియన్ టాప్ డైరెక్టర్ గా నిలిచారు రాజమౌళి.

Rajamouli : హీరోలని డామినేట్ చేసిన రాజమౌళి.. థియేటర్ వద్ద భారీ కటౌట్..

500 కోట్లకు పైగా బడ్జెట్.. నెవర్ బిఫోర్ విజువల్స్, హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్, గ్రాండ్ విజువల్స్, అంతకుమించిన బాలీవుడ్, హాలీవుడ్ స్టార్ కాస్ట్.. వీటన్నింటినీ ట్రిపుల్ఆర్ గా తెరమీదకు తెచ్చారు రాజమౌళి. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రికార్డ్ కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది.

Rajamouli: జక్కన్న క్రేజీ థాట్.. రజనీ-కమల్ తో మల్టీస్టారర్ సినిమా!

20 ఏళ్లలో చేసింది 10 సినిమాలే అయినా అన్ స్టాపబుల్ సక్సెస్ తో.. ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కెరీర్ కంటిన్యూ చేస్తున్న వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళి. జక్కన్న చేసిన ప్రతి సినిమా ఓ ట్రెండ్ సెట్టరే. తెలుగు సినిమా పరిథిని ఒకేసారి వరల్డ్ వైడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ రాజమౌళికి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ లు ఎలా వస్తున్నాయి అంటూ తెగ బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు మిగతా డైరెక్టర్లు.

Rajamouli : అందులో రామ్ గోపాల్ వర్మను స్పూర్తిగా తీసుకున్నా..

ఈగతో సినిమా చేసినా, కమెడియన్ ని హీరోగా పెట్టి చేసినా రాజమౌళి సినిమా హిట్టే. వేరేవాళ్లు కోట్లు కోట్లు బడ్జెట్ పెట్టినా.. భారీ స్టార్ కాస్ట్ పెట్టినా హిట్ అవ్వని సినిమాలు.. రాజమౌళికి ఎందుకు హిట్ అవుతున్నాయంటే.. అతని సినిమాలో కథే హీరో. అందుకే ప్రతి సినిమా హిట్. కథ ప్రేక్షకుడికి కనెక్ట్ కానప్పుడు కోట్లుకుమ్మరించినా.. ఫ్లాపులే మిగులుతాయని చెప్తున్నారు ఈ దర్శకధీరుడు. స్పెషల్లీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేది ఎమోషన్. ఆ ఎమోషన్ ని పండించడంలో రాజమౌళి తర్వాతే ఎవరైనా.

Rajamouli: జక్కన్నతో ఐకాన్ స్టార్ మూవీ..?

నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి ఎన్నో సంచలనాలకి తెరలేపారు. డిఫరెంట్ మూవీస్ చేసి ఎన్నో రికార్డులను సృష్టించారు. ఏ హీరోని పెట్టి సినిమా చేసినా.. అది ఆ హీరోకి మైల్ స్టోన్ అయ్యి తీరాల్సిందే. అలా 10 సినిమాలతో తనకంటూ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి 11వ సినిమా ట్రిపుల్ఆర్ తో అల్టిమేట్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడే కాదు బాహుబలితో స్టార్ట్ అయిన ఆ క్రేజ్ ని ఆ గ్రాండియర్ ని.. ట్రిపుల్ఆర్ తో నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు రాజమౌళి.

Rajamouli : అల్లూరి క్యారెక్టర్‌కి చెర్రీని, కొమరం భీం క్యారెక్టర్‌కి తారక్‌నే ఎందుకు తీసుకున్నానంటే…

బాహుబలికి ముందు తెలుగు సినిమా అంటే జస్ట్ రీజనల్ సినిమాగా ఉండేది. బట్.. రాజమౌళి చేసిన బాహుబలితో అదికాస్తా.. టాలీవుడ్, బాలీవుడ్ ను దాటి.. హాలీవుడ్ వరకూ వెళ్లింది. తెలుగు సినిమాను వరల్డ్ వైడ్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ను ఒకేసారి వేల కోట్లకు పెంచేశాడు. అంతకు ముందు తెలుగు సినిమా తియ్యడానికి 50 కోట్లు అంటే పెద్ద బడ్జెట్ కింద లెక్క. తెలుగులో చాలా సినిమాలు హిట్ అయ్యినా.. ఆ హిట్ సినిమాలు మిగతా లాంగ్వేజెస్ లో రీమేక్ అయినా.. ఏహీరో సినిమా బ్లాక్ బస్టర్ అయినా తెలుగుకు రాని యూనివర్సల్ రికగ్నిషన్ రాజమౌళి చేసిన సినిమాతో వచ్చింది.

Rajamouli: బాహుబలి-3 కూడా ఉంటుంది.. జక్కన్న క్లారిటీ

బాహుబలి సినిమాను 550 కోట్ల బడ్జెట్ తో 5 సంవత్సరాలు తెరకెక్కించి.. అంతే కాన్ఫిడెన్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కలెక్షన్లు 2వేల కోట్లకు పైగానే ఉన్నాయి. బాహుబలి తెలుగు సినిమా అయినా.. బాలీవుడ్ లో మాత్రం కలెక్షన్ల దుమ్మురేపింది. అంతేకాదు.. బాహుబలి సెకండ్ పార్ట్ ఫస్ట్ డే కలెక్షన్ల రికార్డు బాలీవుడ్ పేరు మీదే ఉంది.

Rajamouli: జక్కన్న చేతిలో మరో మల్టీస్టారర్.. అభిమానుల ఎదురుచూపులు!

తెలుగు సినిమా అయినా.. బాలీవుడ్ లో అంతగా కలెక్షన్లు రావడానికి రీజన్ ఏంటి అంటే.. రాజమౌళి మార్కెట్ స్ట్రాటజీ. రాజమౌళి డైరెక్టర్ తో పాటు మంచి మార్కెట్ గురు. తన సినిమాను ఎలా మార్కెట్ చేసుకోవాలో రాజమౌళికి బాగా తెలుసు. అందుకే.. బాలీవుడ్ లో హిట్ కోసం అక్కడి స్టార్లను కూడా సినిమాలో భాగం చేస్తారు ఎప్పుడూ. అంతకముందు బాహుబలి రిలీజ్ కి కరణ్ జోహార్ ని యాడ్ చేసినా ట్రిపుల్ఆర్ లో పాన్ ఇండియా ఇమేజ్ కోసం బాలీవుడ్ స్టార్లని దింపినా ఇదంతా రాజమౌళి స్ట్రాటజీనే.

Rajamouli-Sekhar Kammula : వీళ్లతో సినిమాలు చేస్తే ఫ్లాపులు.. విడాకులేనంట!

50 కోట్ల బడ్జెట్ తో తియ్యాలంటేనే ముందు వెనకా ఆలోచించే టైమ్ లో కోట్లకు కోట్లు బడ్జెట్ పెట్టి సినిమా తీసే ధైర్యం రాజమౌళి ఇచ్చారు. అలా తెలుగు మార్కెట్ కి ఎక్స్ పాండ్ అయ్యే స్టామినా ఉందని ప్రూవ్ చేశారు. మల్టీస్టారర్ అయినా.. భారీ బడ్జెట్ సినిమా అయినా.. చాలా కాలిక్యులేటెడ్ గా.. ప్లాన్డ్ గా సినిమా చేయడం రాజమౌళి స్ట్రాటజీ. అందుకే రాజమౌళి సినిమాకి ఎన్ని కోట్లు బడ్జెట్ పెట్టడానికైనా రెడీగా ఉంటారు ప్రొడ్యూసర్లు.

Rajamouli : ఈ సినిమా డైరెక్టర్ నాకంటే పిచ్చోడిలా ఉన్నాడనుకున్నా : రాజమౌళి

ఇప్పుడు తెరమీదకొచ్చిన ట్రిపుల్ఆర్ కూడా 500 లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిందే. అయితే సినిమా రిలీజ్ కు ముందే 450 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసింది ట్రిపుల్ఆర్. ఇక రిలీజ్ తర్వాత నుంచి బాక్సాఫీస్ లెక్కలు చూస్కోడమే లేటంటున్నారు రాజమౌళి ఫాన్స్. ఆ రేంజ్ లో సినిమాను హ్యూజ్ సక్సెస్ చేసింది రాజమౌళి మేకింగ్. డైరెక్టర్ కి 24 క్రాఫ్ట్స్ లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి దాంతో పాటు ఎఫీషియన్సీ ఉండాలి. సినిమాని గుడ్డిగా తియ్యడం కాదు.. దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి.. మార్కెట్ ని ఎలా ఎక్స్ పాండ్ చేసుకోవాలి అన్న మార్కెట్ లాజిక్స్ కూడా తెలిసిఉండాలి. ఇలాంటి విషయాల్లో ఆరితేరిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.