Mahesh-Rajamouli: టాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా జక్కన్న-మహేష్ ప్రాజెక్ట్?

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. మహేష్-రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతగానో..

Mahesh-Rajamouli: టాలీవుడ్ హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా జక్కన్న-మహేష్ ప్రాజెక్ట్?

Mahesh Rajamouli

Mahesh-Rajamouli: ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయనున్నాడు. మహేష్-రాజమౌళి ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లుగా చెప్పేశారు. కేఎల్ నారాయణ నిర్మించబోతున్న ఈ సినిమా కోసం రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా సిద్ధం చేస్తున్నాడు. అయితే, ఇదే సమయంలో ఈ సినిమా మీద విపరీతమైన ప్రచారం జరిగిపోతుంది.

Mahesh-Boyapati: మహేష్ ఊరమాస్ సినిమా.. బోయపాటికి ఒకే చెప్పేశాడా?

ఈ సినిమా ఏ జానర్ లో ఉండనుంది..? కథ ఏంటి? హీరోయిన్ ఎవరు? మహేష్ ను ఎలా చూపించనున్నారని ఆసక్తి నెలకొంది. ఫైనల్ గా ఈ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కే సినిమా ఓ ఆఫ్రికన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాగా తెలుస్తుంది. కాగా.. ఈ సినిమా పట్టాలెక్కేది ఎప్పుడన్న ప్రశ్న కూడా చాలా ఎక్కువగానే వినిపిస్తుంది. అయితే 2022లో మాత్రం అది జరిగేలా కనిపించడం లేదు. టైమ్ చూసుకొని.. అన్నీ కుదిరాకే.. మహేశ్ బాబుని డైరెక్ట్ చేయాలనేది జక్కన్న ప్లాన్.

Mahesh Babu: మహేష్‌ను వెంటాడుతున్న మే సెంటిమెంట్..?

అయితే.. ఈ సినిమా గురించి ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఈ సినిమా కథ, హీరోయిన్స్, నేపథ్యం ఇలా ఎన్నో ప్రచారం జరగగా ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ పై కూడా గట్టి ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాగా ఇది నిర్మించబోతున్నారని.. రూ.500 నుండి రూ.వెయ్యి కోట్ల మధ్యలో ఈ సినిమా కోసం బడ్జెట్ కేటాయించనున్నారని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు నిజమో కానీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు సినిమా అనౌన్సమెంట్ ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు.