Mahesh-Boyapati: మహేష్ ఊరమాస్ సినిమా.. బోయపాటికి ఒకే చెప్పేశాడా?

తెలుగులో ఊరమస్ సినిమాలు తీసి మెప్పించాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది బోయపాటి పేరే. అప్పుడప్పుడు బెడిసి కొట్టిన సినిమాలున్నా.. కష్టకాలంలో అఖండ లాంటి హిట్ ఇచ్చి ఇండస్ట్రీకి బూస్టప్..

Mahesh-Boyapati: మహేష్ ఊరమాస్ సినిమా.. బోయపాటికి ఒకే చెప్పేశాడా?

Mahesh Boyapati

Mahesh-Boyapati: తెలుగులో ఊరమస్ సినిమాలు తీసి మెప్పించాలంటే ముందుగా చెప్పుకోవాల్సింది బోయపాటి పేరే. అప్పుడప్పుడు బెడిసి కొట్టిన సినిమాలున్నా.. కష్టకాలంలో అఖండ లాంటి హిట్ ఇచ్చి ఇండస్ట్రీకి బూస్టప్ ఇచ్చాడు ఈ దర్శకుడు. అఖండ సక్సెస్ తో ట్రాక్ ఎక్కిన బోయపాటి ఇప్పుడు ఉస్తాద్ హీరో రామ్ తో ఓ పాన్ ఇండియా సినిమాకి సిద్దమవుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా మొదలవనుండగా.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి హీరోలతో సినిమా చర్చలు కూడా జరుగుతున్నాయి.

Boyapati-Suriya: టాలీవుడ్‌కు తమిళ హీరోలు.. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా?

కాగా.. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బోయపాటి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమాకి ప్లాన్ చేస్తున్నాడట. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట బిజీలో ఉండగా ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో హ్యాట్రిక్ సినిమాకి ముహూర్తం కూడా పెట్టేశాడు. అదలా ఉండగానే దర్శక ధీరుడు రాజమౌళితో యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రెండేళ్లకి పైగా డేట్స్ ఇవ్వాల్సి ఉంది. మరి బోయపాటితో సినిమాకి ఎలా మేనేజ్ చేస్తాడో కానీ.. బోయపాటి చెప్పిన ఓ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ మొదలైంది.

Mahesh Babu: బ్రేక్ తరువాతే మాంత్రికుడికి వరం..?

జక్కన్నతో సినిమా అంటే తక్కువలో తక్కువ రెండేళ్ల పాటు షూటింగ్ ఉంటుంది. కనీసం ఏడాది పాటు డేట్స్ ఇచ్చేయాలి. ఈ సినిమా మొదలయ్యే లోగా త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఇక ఏ మాత్రం ఛాన్స్ దొరికినా బోయపాటి సినిమాను కూడా పార్లర్ గా పూర్తిచేస్తారా లేక ముందే కంప్లీట్ చేసేలా కసరత్తులు మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది. అసలు ఈ కాంబినేషన్ సెట్టవుతుందా.. ఒకవేళ అయితే.. అధికారిక ప్రకటన ఎప్పుడన్నది ఇప్పుడు మహేష్ అభిమానులలో ఆసక్తిగా మారింది.