Boyapati-Suriya: టాలీవుడ్‌కు తమిళ హీరోలు.. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా?

మరో కోలీవుడ్ క్రేజీ స్టార్.. డైరెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక్కడి మాస్ డైరెక్టర్ తో కలిసి పక్కా యాక్షన్ ఫిల్మ్ చూపించేందుకు సై అన్నారు. అంతా క్లియరైపోతే విజయ్, ధనుశ్..

Boyapati-Suriya: టాలీవుడ్‌కు తమిళ హీరోలు.. సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా?

Boyapati Suriya

Boyapati-Suriya: మరో కోలీవుడ్ క్రేజీ స్టార్.. డైరెక్ట్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇక్కడి మాస్ డైరెక్టర్ తో కలిసి పక్కా యాక్షన్ ఫిల్మ్ చూపించేందుకు సై అన్నారు. అంతా క్లియరైపోతే విజయ్, ధనుశ్, శివకార్తీకేయన్ ల తర్వాత భారీ కొలాబరేషన్ తో రాబోతున్న ఆ హీరో ఎవరో, ఏ డైరెక్టర్ తో రాబోతున్నాడో ఇప్పుడు చూద్దాం.

Ram-Boyapati: క్రేజీ కాంబినేషన్.. మరోసారి డ్యూయెల్ రోల్‌లో ఉస్తాద్ హీరో?

కోలీవుడ్ స్టార్ సూర్య డైరెక్ట్ ఎంట్రీకి లైన్ క్లియర్ అవుతోంది. సూర్యతో సినిమా చేసే ప్లాన్ ఉందని ప్రకటించారు బోయపాటి శ్రీను. మార్చ్ 10న రిలీజ్ కాబోతున్న ఈటీ ప్రీరిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న బోయపాటి.. సూర్యతో సినిమాపై స్పందించారు. సింగం సిరీస్ తో మాస్ యాంగిల్ ను పీక్స్ కు తీసుకెళ్లిన సూర్య.. టాలీవుడ్ ఊర మాస్ డైరెక్టర్ తో చేతులు కలుపుతున్నాడంటే సినిమా అదరడం ఖాయం.

Suriya : సూర్య ’24’ సినిమాకి సీక్వెల్.. త్వరలో ప్రకటన..

గతంలో రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర 2లో టాలీవుడ్ లో నటించారు సూర్య. అయితే ఫుల్ లెంత్ కమర్షియల్ సినిమాగా చూసుకుంటే బోయపాటితో రీఎంట్రీ ఇస్తున్నట్టే. ప్రస్తుతం రామ్ తో సినిమా చేస్తోన్న ఈ మాస్ డైరెక్టర్.. బన్నీతో ఒకటి, బాలకృష్ణతో అఖండ2 చేయాల్సి ఉంది. బట్ బన్నీ, బాలయ్యల లైనప్ క్లియరై.. బోయపాటి దగ్గరకి రావాలంటే టైమ్ పట్టొచ్చు. ఈలోపు రామ్.. ఆ తర్వాత సూర్యతో బోయపాటి సినిమానుప పూర్తి చేయొచ్చు. సో విజయ్, ధనుశ్, శివకార్తీకేయన్ తర్వాత మరో తమిళ్ స్టార్.. తెలుగు డైరెక్టర్ తో టాలీవుడ్ ఎంట్రీపై అఫీషియల్ న్యూస్ ప్రకటించబోతున్నాడు.