Oscar Awards: ఆస్కార్ ఈవెంట్‌లో యాంకర్‌కు చెంపదెబ్బ.. కారణమిదే

ఆస్కార్ ఈవెంట్స్ వేడుకలో జరిగిన అనూహ్యమైన ఘటనకు అంతా షాక్ అయ్యారు. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ నుంచి కూడా దీనిపై స్పందన వినిపిస్తుంది.

Oscar Awards: ఆస్కార్ ఈవెంట్‌లో యాంకర్‌కు చెంపదెబ్బ.. కారణమిదే

Oscar Awards

Updated On : March 28, 2022 / 4:27 PM IST

Oscar Awards: ఆస్కార్ ఈవెంట్స్ వేడుకలో జరిగిన అనూహ్యమైన ఘటనకు అంతా షాక్ అయ్యారు. పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు బాలీవుడ్ నుంచి కూడా దీనిపై స్పందన వినిపిస్తుంది. అంత కూల్ గా ఉండే విల్ స్మిత్ అలా చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన విల్ స్మిత్ క్షమాపణలు చెప్తూనే ప్రేమ పిచ్చి పనులు చేయిస్తుందని కామెంట్ చేశాడు.

‘ప్రేమ పిచ్చి పనులు చేయిస్తుంది. కళ జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. నేనొక పిచ్చి తండ్రిలా అనిపించొచ్చు. వాళ్లందరూ అన్నట్లే ప్రేమ పిచ్చి పనులు చేయిస్తుంది’ అని వివరణ ఇస్తూ.. కమెడియన్ క్రిస్ రాక్ ను కొట్టినందుకు క్షమాపణ చెప్పాడు. స్మిత్ భార్య జడా పింకెట్‌పై జోక్ వేసినందుకు అలా చేశానని తెలిపాడు. కొట్టిన తర్వాత వివరణ ఇచ్చుకుంటున్న కమెడియన్ పైనా ఫైర్ అయ్యాడు.

‘నోరు మూయ్… ముందు నా భార్య ప్రస్తావించడం మానేయ్’ అని అరుస్తూ కూర్చుండిపోయాడు.

Read Also : ఆస్కార్ వేడుకల్లో ఊహించని సంఘటన.. కమెడియన్‌ని కొట్టిన బెస్ట్ యాక్టర్ విల్‌స్మిత్

అసలు అలా కొట్టడానికి.. క్రిస్ రాక్ జోక్ వెనుక ఉన్న అసలు కథ ఇదే.

కొన్నేళ్లుగా స్మిత్ భార్య జడా పింకెట్.. అలోపెసియా అరీట అనే వ్యాధితో బాధపడుతుంది. ఈ సమస్య కారణంగా జుట్టు కుదుళ్లు బలహీనపడి వెంట్రుకలు ఊడిపోతాయి. చాలా మందిలో చిన్నగా లేదంటే గుండ్రంగా ప్యాచెస్ కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. దీనికి చికిత్స కూడా లేదు.