Site icon 10TV Telugu

Custody Movie: కస్టడీ మూవీకి కూడా ఆ అంశం కలిసొచ్చేనా..?

Will This Aspect Help Custody Movie To Be Success

Will This Aspect Help Custody Movie To Be Success

Custody Movie: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాలో చైతూ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది.

Custody Movie: కస్టడీ నుండి ‘టైమ్‌లెస్ లవ్’ అంటూ వింటేజ్ సాంగ్ పట్టుకొస్తున్న చైతూ

కాగా, ఈ సినిమా నేపథ్యం 90ల కాలం నాటిది కావడంతో ఈ మూవీ విజయంపై ఓ టాపిక్ ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఇటీవల టాలీవుడ్‌లో వస్తున్న సినిమాలన్నీ కూడా 90ల కాలం నాటికి చెందినవిగా తెరకెక్కిస్తున్నారు. ‘రంగస్థలం’ మొదలుకొని రీసెంట్‌గా వచ్చిన ‘దసరా’ మూవీ వరకు పీరియాడిక్ నేపథ్యం సినిమాకు బాగా కలిసొచ్చింది. ఈ సినిమాలే కాకుండా విరూపాక్ష, విడుదల 1, పుష్ప, RRR, పలాస వంటి సినిమాలు కూడా 80-90 దశకంల బ్యాక్‌డ్రాప్‌తో వచ్చాయి. ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

Custody Movie: ‘కస్టడీ’ టీజర్‌కు అదిరిపోయిన రెస్పాన్స్.. ఏకంగా 15 మిలియన్ వ్యూస్!

దీంతో ఇప్పుడు 90ల నేపథ్యంలో వస్తున్న కస్టడీ మూవీకి కూడా ఈ పీరియాడిక్ అంశం బాగా కలిసొస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, విలక్షణ యాక్టర్ అరవింద్ స్వామి ఈ మూవీలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం అందిస్తున్న కస్టడీ మూవీని శ్రీనివాస్ చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మే 12న రిలీజ్ అవుతున్న కస్టడీ మూవీకి ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Exit mobile version