Nagabhushana : కన్నడ యాక్టర్ ర్యాష్ డ్రైవింగ్.. మహిళ మృతి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
ర్యాష్ డ్రైవింగ్ తో కన్నడ యాక్టర్ నాగభూషణ ఒక మహిళ ప్రాణాలను బలికొన్నాడు. దీంతో నాగభూషణ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

women passed away due to kannada actor Nagabhushana car accident
Nagabhushana : కన్నడ యాక్టర్ నాగభూషణ తన ర్యాష్ డ్రైవింగ్ తో ఒక మహిళ ప్రాణాలను బలికొన్నాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 30 శనివారం రాత్రి బెంగళూరులో చోటు చేసుకుంది. అతివేగంతో కారు నడుపుతూ వస్తున్న నాగభూషణ బెంగళూరులోని కోనకుంటె క్రాస్ సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక జంట పైకి దూసుకు వెళ్ళాడు. ఈ ప్రమాదంలో 48 ఏళ్ల మహిళ మృతి చెందింది. దీంతో నాగభూషణ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Bhagavanth Kesari : భగవంత్ కేసరి సెకండ్ సింగల్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య..
పోలీసులు వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో నాగభూషణ ఆర్ఆర్ నగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని జేపీ నగర్‌లోని తన నివాసానికి తిరిగి కారులో వెళ్తున్నాడు. కారు అతివేగంతో ఉండడంతో కోననకుంటె క్రాస్ సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఫుట్‌పాత్ పై నడుస్తున్న కృష్ణప్ప-ప్రేమ దంపతుల పైకి దూసుకెళ్లింది. ఇక ఆ గాయపడిన దంపతులను.. యాక్సిడెంట్ చేసిన నాగభూషణే దగ్గరుండి ఆటోరిక్షాలో ఆస్పత్రికి తీసుకెళ్లాడు.
Salaar : సలార్ ఆ మూవీకి రీమేక్.. కన్ఫార్మ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్..
అయితే మహిళకు తీవ్ర గాయాలు అవ్వడంతో హాస్పిటల్ కి చేరుకోవడానికి ముందే ఆమె మరణించింది. ఆమె భర్త కృష్ణప్ప (58) ప్రస్తుతం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక ఈ విషయం పై ఆ దంపతుల కుమారుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. రాత్రి భోజనం చేసి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న తన తల్లిదండ్రులను నాగభూషణ కారు ఢీకొట్టిందని పేర్కొన్నాడు. అయితే నాగభూషణ ఇచ్చిన స్టేట్మెంట్లో.. ఆ దంపతులు అకస్మాత్తుగా ఫుట్‌పాత్ నుండి రహదారిపైకి రావడం వలనే ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చాడు. పోలీసులు అరెస్ట్ చేసిన నాగభూషణ శనివారం అర్థరాత్రి బెయిల్‌పై విడుదలయ్యాడు.