Salaar : సలార్ ట్రైలర్‌లో యశ్ ఉన్నాడా..? ఆ సీన్‌ని మీరు గమనించారా..?
కొంతమంది అభిమానులు సలార్ సెకండ్ ట్రైలర్‌లో యశ్ ని గమనించారు. ఆ సీన్‌ని మీరు చూశారా..?

Yash appeared in Prabhas Salaar Part 1 Ceasefire Release trailer
Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతున్న సలార్ పార్ట్ 1 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు, శ్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 22న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఒక ట్రైలర్ ని రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా పూర్తి యాక్షన్ కట్ తో మరో ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ ట్రైలర్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక మూవీ లవర్స్ కి సినిమా పై భారీ క్యూరియాసిటీ క్రియేట్ చేసింది.
ఇది ఇలా ఉంటే, కొంతమంది అభిమానులు ఈ ట్రైలర్ లో ఓ విషయాన్ని గమనించారు. ట్రైలర్ లోని ఓ సీన్ లో ఒక వ్యక్తిని బ్యాక్ షాట్ నుంచి చూపించారు. ఆ కటౌట్ చూస్తుంటే యశ్ లాగా కనిపిస్తున్నారు. ఈ బ్యాక్ షాట్‌ని, కేజీఎఫ్ లోని యశ్ బ్యాక్ షాట్‌ని కంపేర్ చేస్తూ ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక ఈ పోస్టులు చూసిన మూవీ లవర్స్.. యశ్ ఈ సినిమాలో నిజంగా కనిపించబోతున్నారా..? అనే ఆసక్తి నెలకుంది. అయితే ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్, సలార్ మధ్య ఎటువంటి కనెక్షన్ లేదని ఇటీవల కన్ఫార్మ్ చేసిన సంగతి తెలిసిందే.
Also read : Salaar : సలార్ సినిమా చేయనన్నాను.. పృథ్విరాజ్ సుకుమారన్ కామెంట్స్..
View this post on Instagram
యశ్ సలార్ లో కనిపించాలంటే.. రాకీ భాయ్ గానే కనిపించాలా ఏంటి? మరో కొత్త పాత్రలో, సలార్ వరల్డ్ కి సంబంధించిన ఒక కొత్త రోల్ తో యశ్ కనిపించే అవకాశం ఉంది కదా. ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్, సలార్ కి కనెక్షన్ లేదని చెప్పారు గాని, సలార్ మూవీలో యశ్ లేడని చెప్పలేదు కదా. ప్రస్తుతం ఈ సందేహాలు అన్ని ప్రశ్నలు గానే ఉన్నాయి. వీటన్నిటికీ జవాబు కావాలంటే.. డిసెంబర్ 22న మూవీ రిలీజ్ అయ్యేవరకు ఎదురు చూడాల్సిందే. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మరో సాంగ్, రాజమౌళితో చేసిన ఇంటర్వ్యూ కూడా బయటకి రావాల్సి ఉంది.