Krrish 4: డైరెక్టర్ గా హృతిక్ రోషన్.. డ్రీం ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు.. వాళ్ళు వద్దే వద్దు అన్నారట!
హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న క్రిష్ 4(Krrish 4) గురించి లేటెస్ట్ అప్డేట్.
Yash Raj Films shocked Hrithik Roshan about Krrish 4 movie.
- క్రిష్ 4కి డైరెక్టర్ గా హృతిక్ రోషన్
- యష్ రాజ్ సంస్థతో టయప్
- రూ.500 కోట్లు అడిగితే నో అన్నారట
Krrish 4: బాలీవుడ్ గ్రీకు వీరుడిగా పేరుతెచ్చుకున్నాడు హృతిక్ రోషన్. ఆయన సినిమాలాక్ ఆడియన్స్ లో ఎంత క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా ఆయన సూపర్ హీరోగా చేసిన క్రిష్(Krrish 4) సిరీస్ కి సూపర్ డిమాండ్ ఉంది. ఆ సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ లో సీక్వెల్ గా క్రిష్ 4 వస్తున్న విషయం తెలిసిందే.
అయితే, ఇక్కడ విశేషం ఏంటంటే, గత మూడు సినిమాలను హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించగా క్రిష్ 4కి మాత్రం స్వయంగా హృతిక్ రోషనే మెగా ఫోన్ పట్టుకోనున్నాడట. అంతేకాదు, ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే, క్రిష్ సిరీస్ కి ఆడియన్స్ లో ఫుల్ డిమాండ్ ఉండగా ఈసారి యష్ రాజ్ సంస్థ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది.
అయితే, క్రిష్ 4 సినిమాను హృతిక్ రోషన్ భారీ గ్రాఫిక్స్ తో హాలీవుడ్ రేంజ్ లో తీయాలని చూస్తున్నాడట. అందుకోసం తనకు రూ.500 కోట్ల వరకు బడ్జెట్ అవుతుందని యష్ రాజ్ ఫిలిమ్స్ ని కోరాడట హృతిక్ రోషన్. అయితే, ఆ సూచనను యష్ రాజ్ సంస్థ అంగీకరించలేదు అని తెలుస్తోంది. కేవలం రూ.350 కోట్లలో సినిమాను ఫినిష్ చేయాలనీ కోరారట. లేదంటే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాం అని కూడా వార్నింగ్ ఇచ్చారట.
అసలు ఊహించని పరిణామంతో హృతిక్ రోషన్ అయోమయంలో పడిపోయాడట. కేవలం రూ.350 కోట్లతో అంత పెద్ద సినిమాను చేయడం చాలా కష్టం అని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సిచువేషన్ లో హృతిక్ రోషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. చూడాలి మరి ఈ వివాదం ఎక్కడివరకు వస్తుంది అని.
