Yash Ranbir Kapoor Alia Bhatt in Allu Aravind ramayana project
Yash – Ranbir Kapoor : బాహుబలి (Bahubali) తరువాత ప్రేక్షకుడు సినిమా చూసే పద్ధతి మారిపోయింది. దానికి తగ్గట్టు మేకర్స్ కూడా మారుతూ వస్తున్నారు. సినిమాల్లో భారీతనం చూపిస్తూ కథని కొత్తగా చెప్పడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఇండియన్ సినిమా రేంజ్ పెరిగిపోయింది. ఇంటర్నేషనల్ లెవెల్ భారతీయ సినిమాలకు ఆదరణ పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా మన నేటివిటీని, మన మట్టి కథలను ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. అలాంటి మన ఇతిహాస గ్రంధాల్లో గొప్పగా చెప్పుకొనే కొన్ని కథలను ప్రపంచ ప్రేక్షకులకు చూపే ప్రయత్నం చేస్తున్నారు మన మేకర్స్.
Varun – Lavanya : వరుణ్ – లావణ్య ఎంగేజ్మెంట్ కన్‌ఫార్మ్.. మెగా టీం అఫిషియల్ నోట్!
ఈ క్రమంలోనే శాకుంతలం (Shaakuntalam), ఆదిపురుష్ (Adipurush), హనుమాన్ (Hanuman) వంటి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ సెట్ అవుతుంది. సంపూర్ణ రామాయణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాడు టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్. ఇందుకోసం గత 5 ఏళ్లగా వర్క్ చేస్తూనే ఉన్నారు. దంగల్ (Dangal) వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నాడు.
Rana Daggubati : షారుఖ్, హృతిక్ లను ప్రేక్షకులు చూడాలని అనుకోవడం లేదు.. రానా వైరల్ కామెంట్స్!
ఇటీవల ఈ ప్రాజెక్ట్ గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది చివరిలో ఈ ప్రాజెక్ట్ మొదలు కాబోతున్నట్లు కన్‌ఫార్మ్ చేశాడు. ఇక ఈ సినిమాలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ని ఒకే చేశారట. ఆల్రెడీ లుక్ టెస్ట్‌లు కూడా పూర్తయ్యాయి అని తెలుస్తుంది. సీతగా సాయి పల్లవి (Sai Pallavi) చేయబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీతగా అలియా భట్ (Alia Bhatt) కన్‌ఫార్మ్ అయ్యినట్లు సమాచారం. ఇక రావణాసురుడిగా కేజీఎఫ్ (KGF) హీరో యశ్ (Yash) కోసం సంప్రదిస్తున్నారట. ఒకవేళ రావణాసురుడిగా యశ్ ఒకే చేస్తే సినిమా మరో రేంజ్ లో ఉంటుందని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. మరి చివరిగా ఈ సినిమాలో ఎవరిని ఒకే చేస్తారో చూడాలి.